‘హనుమాన్’ చిత్రంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న యువహీరో తేజ సజ్జా నటిస్తున్న తాజా చిత్రం ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై విశ్వప్రసాద్, కృతిప్రసాద్ నిర్మిస్తున్నారు. పీరియాడిక్, ఫాంటసీ అంశాలతో రూపొందిస్తున్న సూపర్‌హీరో కథాంశమిది. సెప్టెంబర్ 5న 2డీ, త్రీడీ ఫార్మాట్లలో పాన్ ఇండియా స్థాయిలో విడుదలకానుంది. ఈ నేపథ్యంలో మ్యూజికల్ ప్రమోషన్స్‌కు శ్రీకారం చుట్టబోతున్నారు.
ఈ నెల 26న ‘వైబ్ ఉంది..’ అంటూ సాగే తొలిగీతాన్ని విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. వినాశకర శక్తుల నుంచి ఈ ప్రపంచాన్ని రక్షించే ఓ యోధుడి కథ ఇదని, విలన్‌గా మంచు మనోజ్ నటిస్తున్నారని మేకర్స్ తెలిపారు. రితికా నాయక్, శ్రియ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: గౌరహరి, దర్శకత్వం: కార్తీక్ ఘట్టమనేని.