Mirai Box Office Day2 | తేజ సజ్జ నటించిన ‘మిరాయ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాస్తోంది. విడుదలైన రెండు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 55.60 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించింది. ‘హనుమాన్’ సినిమాతో పాన్-ఇండియా స్టార్‌గా మారిన తేజ సజ్జ ‘మిరాయ్’తో మరోసారి తన స్టార్‌డమ్‌ను నిరూపించుకున్నారు. సెప్టెంబర్ 12న విడుదలైన ‘మిరాయ్’ తొలి రోజు నుంచే అద్భుతమైన వసూళ్లను రాబడుతుంది. సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 27.20 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించిన ఈ చిత్రం రెండో రోజు రూ. 28.40 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించింది. దీంతో రెండు రోజుల్లోనే ఈ చిత్రం రూ.50 కోట్ల మార్క్‌ను దాటడం విశేషం. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై సుమారు రూ. 60 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. ‘మిరాయ్’ సినిమాకు విజువల్స్, కథ, మరియు నటీనటుల నటనకు మంచి స్పందన రావడంతో, వారాంతంలో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది.
#SuperYodha is breaking boundaries and blazing at the box office 🔥🔥🔥
₹𝟱𝟱.𝟲 𝗖𝗥 Worldwide GROSS in 2 DAYS for #Mirai ❤️🔥❤️🔥❤️🔥
Experience #BrahmandBlockbusterMirai ONLY IN CINEMAS 💥💥💥
Superhero @tejasajja123
Rocking Star @HeroManoj1… pic.twitter.com/z7k4HRS4JK— People Media Factory (@peoplemediafcy) September 14, 2025