Minister Indrakaran Reddy | ఆస్కార్ అవార్డును అందుకున్న ఆర్ఆర్ఆర్ చిత్రబృందానికి రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. చిత్రంలో ‘నాటు నాటు’ సాంగ్‌కు అవార్డు రావడంపై మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. దర్శకుడు రాజమౌళి, నటులు రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, రచయిత చంద్రబోస్‌తో పాటు చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. పోరాట యోధులు కుమ్రంభీం, అల్లూరి సీతారామారాజుకు అంతర్జాతీయ స్థాయి గౌరవాన్ని, గుర్తింపును తీసుకురావడం మనందరికీ గర్వకారణమన్నారు. ఆర్ఆర్ఆర్కు సినిమాలోని నాటు నాటు పాటకు ప్రతిష్ఠాత్మక ఆస్కార్ దక్కడం భారతీయ సినిమాకు, ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు దక్కిన అత్యుత్తమ గౌరవమని మంత్రి అభిప్రాయపడ్డారు.