అంథాలజీ సినిమాగా ప్రేక్షకులకు ముందుకొచ్చి సూపర్ హిట్‌గా నిలిచిన ప్రాజెక్టు లస్ట్ స్టోరీస్ (Lust Stories). ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ (Indian film industry)లో హైలెట్ కాని ఫీమేల్ సెక్సువాలిటీ టాపిక్‌తో సాగే ఈ చిత్రానికి అనురాగ్ కశ్యప్, దీబాకర్ బెనర్జీ, జోయా అఖ్తర్, కరణ్ జోహార్ దర్శకత్వం వహించారు. రాధికా ఆప్టే, కియారా అద్వానీ, విక్కీ కౌశల్, నేహా దూపియా, భూమి పెడ్నేకర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
కాగా ఈ సూపర్ హిట్ ప్రాజెక్టుకు సీక్వెల్ (Lust Stories 2) రాబోతుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. తాజా అప్డేట్ ప్రకారం ఈ కల్ట్ ఫిల్మ్‌కు సీక్వెల్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుందట. ఎంసీఏ చిత్రంలో విలన్‌గా నటించిన హైదరాబాదీ నటుడు విజయ్ వర్మ లీడ్ రోల్లో కనిపించనున్నాడని టాక్. అంతేకాదు మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannah) సీక్వెల్లో భాగస్వామ్యం కానుందన్న న్యూస్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
సుజయ్ ఘోష్ డైరెక్ట్ చేయబోతున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తమన్నా ప్రస్తుతం సత్యదేవ్‌తో కలిసి గుర్తుందా సీతాకాలం సినిమా చేస్తోంది. దీంతోపాటు మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న భోళా శంకర్‌లో ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. మరోవైపు హిందీలో ప్లాన్ ఏ ప్లాన్ బీ, బోలే చుడియాన్ చిత్రాల్లో నటిస్తోంది.