ముంబై: బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ ఇండియన్ ఫిల్మ్ ప్రేక్షకులను థ్రిల్ చేయనున్నారు. టైసన్ పంచ్‌లు తొలిసారి ఇండియన్ స్క్రీన్‌పై కనిపించనున్నాయి. విజయ దేవరకొండ నటిస్తున్న లైగర్ మూవీలో .. మైక్ టైసన్ స్పెషల్ రోల్లో అట్రాక్ట్ చేయనున్నాడు. పూరీ జగన్నాథ్ డైరక్షన్లో లైగర్ సినిమా షూటింగ్ ప్రస్తుతం గోవాలో జరుగుతోంది. అయితే ఫిల్మ్‌మేకర్ కరణ్ జోహార్ ఇవాళ ఆ మూవీకి చెందిన ఓ సూపర్ అప్డేట్ ఇచ్చారు. ఏడు సార్లు ప్రపచం ఛాంపియన్ అయిన మైక్ టైసన్ లైగర్ మూవీలో కేక పుట్టించనున్నట్లు తన ట్విట్టర్ ద్వారా కరణ్ జోహార్ వెల్లడించాడు. మొట్టమొదటిసారి.. కింగ్ ఆఫ్ ద రింగ్‌గా ప్రఖ్యాతిగాంచిన లెజండరీ బాక్సర్ మైక్ టైసన్ ఇండియన్ సినిమాలో కనిపించనున్నట్లు చెప్పాడు. లైగర్ మూవీలో కనిపించే క్లైమాక్స్ దృశ్యాల్లో టైసన్ తన పంచ్‌లతో అలరించనున్నారు. మిక్స్డ్ మార్షియల్ ఆర్ట్స్ ఫైటర్ క్యారెక్టర్లో అర్జున్ రెడ్డి ఫేమ్ విజయ్ దేవరకొండ ఈ సినిమాలో నటిస్తున్నాడు.
లైగర్ ప్రేక్షకులకు పిచ్చి పిచ్చి ఎంటర్టైన్మెంట్ తప్పదని విజయ్ కూడా తన ట్వీట్లో తెలిపాడు. దానికి తగినట్లే ఈ ఫిల్మ్‌లో టైసన్ నటించడం ఆశ్చర్యమే. బాక్సింగ్ చరిత్రలో చాలా క్రూరమైన బాక్సర్‌గా గుర్తింపు ఉన్న టైసన్.. లైగర్ దేవరకొండతో ఫైనల్ బౌట్ లో హోరెత్తించనున్నాడు. ఐరన్ మైక్‌గా, ఆల్ టైమ్ గ్రేట్ బాక్సర్‌గా గుర్తింపు పొందిన మైక్ టైసన్‌తో విజయ్ దేవరకొండ ఫైటింగ్ సన్నివేశాలు ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గోవాలో వళ్లు జలదరించే సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. తీవ్రమైన ఉత్కంఠను రేపే రీతిలో పూరీ జగన్నాథ్.. లైగర్ ఫిల్మ్‌ను షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. స్టంట్ కోరియోగ్రాఫర్‌గా కెచ్చా చేస్తున్నారు. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దీన్ని రిలీజ్ చేయనున్నారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మళయాలం భాషల్లో ఈ ఫిల్మ్‌ను నిర్మిస్తున్నారు.
For the first time ever, the king of the ring will be seen on the big screens of Indian cinema! Welcoming @MikeTyson to the #LIGER team!🥊 #NamasteTyson@TheDeverakonda @ananyapandayy #PuriJagannadh @charmmeofficial @apoorvamehta18 @RonitBoseRoy @meramyakrishnan @iamVishuReddy pic.twitter.com/pl5AnUSB35
— Karan Johar (@karanjohar) September 27, 2021
We promised you Madness!
— Vijay Deverakonda TOOFAN (@TheDeverakonda) September 27, 2021
We are just getting started 🙂
For the first time on Indian Screens. Joining our mass spectacle – #LIGER
The Baddest Man on the Planet
The God of Boxing
The Legend, the Beast, the Greatest of all Time!
IRON MIKE TYSON#NamasteTYSON pic.twitter.com/B8urGcv8HR
హంగామాకు సిద్ధంగా ఉండండి అని, వచ్చే ఏడాది ఈ మూవీ రిలీజ్ కానున్నట్లు విజయ్ దేవరకొండ మరో ట్వీట్లో తెలిపారు.