పాప్ కింగ్ మైఖేల్ జాక్సన్ బయోపిక్ తెరకెక్కుతోంది. ఈ చిత్రం 2025లో థియేటర్లలోకి రానుంది. జనవరి 22న సినిమా నిర్మాణాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆంటోయిన్ ఫుక్వా దర్శకత్వం వహిస్తున్నారు. జాక్సన్ మేనల్లుడు జాఫర్ జాక్సన్ ఈ చిత్రంలో దిగ్గజ సంగీతకారుడి పాత్రలో టైటిల్ రోల్‌ను పోషించనున్నాడు. జపాన్ మినహా యూనివర్సల్ పిక్చర్స్ ఈ చిత్రానికి సంబంధించి అంతర్జాతీయ హక్కులను కలిగి ఉంది. మైఖేల్ జాక్సన్ ఎస్టేట్‌కు సహ నిర్వాహకులుగా ఉన్న జాన్ బ్రాంకా, జాన్ మెక్క్లెయిన్లతో కలిసి గ్రాహం కింగ్ నిర్మిస్తున్నారు. ‘గ్లాడియేటర్’, ‘ది ఏవియేటర్’ చిత్రాలను రాసిన జాన్ లోగన్ స్క్రిప్ట్ రాశారు.