Meter Movie Trailer | ‘వినరో భాగ్యము విష్ణు కథ’ సినిమాతో మంచి కంబ్యాక్ ఇచ్చిన కిరణ్.. ప్రస్తుతం అదే జోష్‌తో ‘మీటర్’ సినిమాతో ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. రమేష్ కాడూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇటీవలే రిలీజైన ట్రైలర్ సినిమాపై ఎక్కలేని అంచనాలు క్రియేట్ చేశాయి. మాస్ యాక్షన్‌తో టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 7న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్రబృందం వరుస అప్డేట్లు ప్రకటిస్తూ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు.
తాజాగా మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ అప్డేట్ను ప్రకటించారు. ఈ సినిమా ట్రైలర్‌ను మార్చి 29న రిలీజ్ చేస్తున్నట్లు పోస్టర్‌ను రిలీజ్ చేశారు. పోస్టర్లో కిరణ్ అల్ట్రా స్టైలిష్‌లుక్‌లో అదరగొడుతున్నాడు. ఈ సినిమాలో కిరణ్ పోలీస్ అధికారిగా కనిపించబోతున్నాడు. క్లాప్ ఎంటర్టైనమెంట్స్ పతాకంపై చెర్రీ, హేమలత పెదమాళ్లు ఈ సినిమాను నిర్మించారు. సాయి కార్తిక్ స్వరాలు అందించాడు. ఇప్పటికే రిలీజైన పాటలన్ని చార్ట్ బస్టర్‌గా ఇటీవలే డిస్ట్రిబ్యూషన్ సంస్థను స్థాపించిన మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తుంది.
#Meter is all set to hit its maximum levels with MASS and ENTERTAINMENT 🔥🔥#MeterTrailer Blasting on 29th March 💥💥#MeterOnApril7th @Kiran_Abbavaram @AthulyaOfficial #RameshKaduri #SaiKartheek @ClapEntrtmnt @SonyMusicSouth pic.twitter.com/zE9WwGX2Mw
— Mythri Movie Makers (@MythriOfficial) March 26, 2023