Merry Christmas Movie | ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు ఉప్పెన, విక్రమ్, జవాన్ వంటి పలు సినిమాల్లో విలన్‌గా మెప్పిస్తున్నాడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి. పాత్ర నచ్చితే నిడివి ఎంత అని ఆలోచించకుండా నటించే అతికొద్ది మంది నటులలో ఈయన ఒకడు. ఇక ప్రస్తుతం విజయ్ సేతుపతి ఆరు సినిమాలను సెట్స్‌పైన ఉంచాడు. అందులో మెర్రీ క్రిస్మస్ ఒకటి. బద్లాపూర్, అంధాదూన్ వంటి అల్టిమేట్ సినిమాలు తెరకెక్కించిన శ్రీరామ్ రాఘవన్ ఈ సినిమాకు దర్శకుడు. ఇప్పటికే రిలీజైన టైటిల్ పోస్టర్‌కు విశేష స్పందన వచ్చింది. తాజాగా మేకర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు.
మేరి క్రీస్మస్ సినిమాను డిసెంబర్ 15న రిలీజ్ చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేసింది. రాత్రంతా చాలా సీరియస్‌గా ఉంటుంది. ప్రొద్దున చాలా కలర్ఫుల్గా ఉంటుందంటూ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. చూస్తుంటే ఈ సినిమా ఓ మంచి లవ్‌స్టోరీగా కనిపిస్తుంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతికి జోడీగా కత్రినా కైఫ్ నటిస్తుంది. ఈ సినిమాను టిప్స్ ఫిలింస్, మ్యాచ్ బాక్స్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాగా ఈ సినిమా హిందీతో పాటు తమిళంలోనూ రిలీజ్ కానుంది. ఇక విజయ్ హీరోగా నటిస్తున్న తొలి హిందీ సినిమా ఇదే కావడం విశేషం. దీనితో పాటు షారుఖ్ ‘జవాన్’లోనూ విజయ్ కీలకపాత్ర పోషిస్తున్నాడు.
We decided to cut short the wait for the Christmas cheer!#MerryChristmas releasing in theatres near you ON 15th DECEMBER 2023.
#SriramRaghavan @TipsFilmsInd #MatchboxPictures @RameshTaurani #SanjayRoutray #JayaTaurani #KewalGarg #KatrinaKaif @realradikaa #KavinBabu… pic.twitter.com/dvFNvO2yjE— VijaySethupathi (@VijaySethuOffl) July 17, 2023