Men Too Movie On Ott | ప్రస్తుతం ఓటీటీల కాలం నడుస్తుంది. వందల కోట్లు కొల్లగొట్టిన సినిమాలు సైతం నాలుగు వారాల్లోనే ఓటీటీలోకి దర్శనమిస్తున్నాయి. ఇక డిజాస్టర్ సినిమాలైతే పట్టుమని పదిహేను రోజులు కాకముందే సందడి చేస్తున్నాయి. ఓటీటీ సంస్థలు కూడా డిజాస్టర్ అయిన సినిమాలను తొందర స్ట్రీమింగ్ చేసేందుకు మేకర్స్ కు మంచి డీల్స్ ఆఫర్ చేస్తున్నాయి. ఇక నష్టాల్లో కొంచెం అయినా భారం తగ్గుతుందని నిర్మాతలు కూడా ఓటీటీ సంస్థలిచ్చే ఆఫర్ లకు టెంప్ట్ అయిపోతున్నాయి. తాజాగా మరో సినిమా పట్టుమని పది రోజులు కూడా పూర్తి కాలేదు విడుదలై.. అప్పుడే ఓటీటీ డేట్ ను ప్రకటించేసింది.
బ్రహ్మాజీ, నరేష్ అగస్త్య, మౌర్య సిద్ధవరం, ప్రియాంక శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన మెన్ టూ సినిమా గతవారం ప్రేక్షకులు ముందుకు వచ్చింది. రిలీజ్ కు ముందు ప్రమోషన్లు గట్రా చేయకపోవడంతో సినిమా విడుదలైన విషయమే సగం జనాలకు తెలియకుండా వెళ్లిపోయింది. దానికి తోడు చూసిన వారు కూడా నెగెటీవ్ రివ్యూలు ఇవ్వడంతో రెండో రోజు నుంచే సినిమా తేలిపోయింది. పురుషుల కష్టాలపై రూపొందిన ఈ సినిమాకు శ్రీకాంత్ జీ రెడ్డి దర్శకత్వం వహించాడు.