Memu Famous Trailer | ఈ మధ్య కాలంలో థియేటర్‌కు ప్రేక్షకుడిని రప్పించాలంటే టీజర్, ట్రైలర్లతో పాటు ప్రమోషన్లు కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. ప్రమోషన్లతో సినిమాపై కావాల్సిన బజ్ తీసుకురావచ్చు. అంతేకాకుండా ఎంత కొత్తగా ప్రమోషన్లు చేస్తే అంత స్పీడ్‌గా సినిమా జనాల్లోకి వెళ్తుంది. ప్రస్తుతం అదే స్ట్రాటజీని ఫాలో అవుతుంది మేము ఫేమస్ చిత్ర బృందం. రెండు నెలల ముందు వరకు అసలు ఈ సినిమా ఉన్న విషయమే సగం జనాలకు తెలియదు. మంత్రి మల్లారెడ్డితో ఏమంట టీజర్ లాంచ్ చేయించారో.. అప్పుడు సినిమాపై ఎక్కడలేని బజ్ ఏర్పడింది. టీజర్ రొటీన్‌గానే అనిపించిన టీజర్ లాంచ్‌లో మల్లారెడ్డి స్పీచ్ సినిమాకు బాగా కలిసొచ్చింది. ఒక్క సారిగా ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ చూసుకున్నా అదే స్పీచ్ కనిపించింది.
ఇదంతా ఒకెత్తయితే గత పది రోజులుగా పలువురు సెలబ్రెటీలతో చేస్తున్న చిన్న వీడియో ప్రోమోలతో సినిమాపై ఎక్కడలేని హైప్ వచ్చింది. ఇదే ఊపులో మేకర్స్ తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ట్రైలర్‌తోనే సినిమా కాన్సెప్ట్ ఏంటో క్లారిటీ ఇచ్చేశారు. తెలంగాణ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథలో పని పాటలేని ముగ్గురు కుర్రాళ్లు. వాళ్లను ఇంట్లో వాళ్లే కాదు ఊర్లోని తిట్టని వారుండరు. అలా సరదాగా జీవితాన్ని గడిపేస్తున్న వీళ్లు లవర్స్‌ను సెట్ చేసుకునే పనిలో పడతారు. ఖాళీగా తిరుగుతున్న వీళ్లకు అమ్మాయిని ఎవరిస్తారు అని వీళ్ల గర్ల్‌ఫ్రెండ్స్ పేరెంట్స్ గొడవకు దిగుతారు. దీంతో సరదాగా గడిచిపోతున్న ఈ కుర్రాళ్ల జీవితంలోకి సమస్యలు వచ్చి పడుతాయి. తమను తాము ఎలాగైనా నిరూపించుకోవాలని ఈ కుర్రాళ్లు ఓ పని మొదలు పెడతారు. అందులో వీళ్లు ఎలా సక్సెస్ అయ్యారు. ఈ సక్సెస్ వీళ్లను ఎంత ఫేమస్ చేసింది అనేది కథ అని ట్రైలర్‌తో చిత్రబృందం స్పష్టం చేసింది.
ఈ సినిమాను యూట్యూబ్ స్టార్ సుమంత్ నటిస్తూ, దర్శకత్వం వహించాడు. ఇక ట్రైలర్లో తెలిసిన మోహాలు చాలా తక్కువగా ఉన్నప్పటికి అనుభవం ఉన్న నటులుగా పర్ఫార్మ్ చేసినట్లు ట్రైలర్లో కనిపిస్తుంది. కొన్ని చోట్ల జాతిరత్నాలు వైబ్స్ కనిపిస్తున్నాయి. అయితే ఇదంతా పక్కా పల్లె వాతావరణంలో జరగడంతో యూత్‌లో మంచి హైప్ క్రియేట్ అయింది. దానికి తోడు ఈ మధ్య విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్లే. ఈ లెక్కన మేము ఫేమస్ సినిమా కూడా కాస్త ఎంటర్టైనమెంట్ డోస్ ఎక్కువగా ఉంటే సమ్మర్లో సర్ప్రైజ్ హిట్ ఖాయం. చాయ్ బిస్కెట్ ఫిలింస్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాను అల్లు అరవింద్ విడుదల చేస్తున్నాడు.