Memu Famous Movie Release Date | యూట్యూబ్ స్టార్ సుమంత్ ప్రభాస్ ‘మేము ఫేమస్’ అనే సినిమాతో హీరోగా డెబ్యూ ఇస్తున్నాడు. నటుడిగానే కాకుండా ఈ సినిమాకు సుమంత్ దర్శకత్వం కూడా వహించాడు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, పాటలు, టీజర్ సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై యూత్‌లో మంచి క్రేజే ఉంది. దానికి తోడు టీజర్ లాంచ్‌కు మంత్రి మల్లారెడ్డి గెస్ట్‌గా రావడం.. ఆయన స్పీచ్ వైరల్ అవడంతో సినిమాపై ఎక్కడలేని హైప్ వచ్చింది. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రీ పోన్ చేశారు.
ముందుగా ఈ సినిమాను జూన్ 2కు రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. కాగా తాజాగా ఈసినిమాను ప్రీ పోన్ చేస్తున్నట్లు ప్రకటించారు. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. వర్షం పడుతుంది చమ్ చమ్ చమ్.. మే 26న మేము ఫేమస్‌కు అందరూ కమ్ కమ్ కమ్ అంటూ కొత్త రిలీజ్ డేట్‌ను అనౌన్స్‌చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్లు కూడా కొత్తగా ట్రెండ్‌కు తగ్గట్లుగా చేస్తున్నారు.