నాని తాజా చిత్రం ‘హిట్-ది థర్డ్ కేస్’ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నది. సక్సెస్ఫుల్ ఫ్రాంఛైజీ ‘హిట్’ సిరీస్‌లో మూడో భాగంగా వస్తున్న ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకుడు. మే 1న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో మ్యూజికల్ ప్రమోషన్స్‌కు శ్రీకారం చుట్టారు. సోమవారం ‘ప్రేమ వెల్లువ..’ అనే పాటను విడుదల చేశారు. మిక్కీ జే మేయర్ స్వరపరచిన ఈ పాటను సిధ్‌శ్రీరామ్, నూతన మోహన్ ఆలపించారు. కృష్ణకాంత్ రచించారు. ‘దూకే నాపై ఇలా..ఇవాళే ప్రేమ వెల్లువ, పగలే నావైపుకి నడిచే కలవా.. పడుతూ ఎగిరే అలవా.. మనసే నిను చూడని ఒకటే గొడవ..కనులే ఇపుడే చదివా..వెంట వచ్చావే..వెంబడించావే.. ఊపిరళ్ల మారావే నేడే నీవే’ అంటూ చక్కటి ప్రేమ భావాలను వ్యక్తం చేస్తూ సాగిందీ గీతం. నాని, శ్రీనిధి శెట్టి మధ్య కెమిస్ట్రీ, విజువల్స్ హైలైట్‌గా నిలిచాయి. మెలోడీ ప్రధానంగా అర్థవంతమైన సాహిత్యంతో ఈ పాట ఆకట్టుకుంటుందని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జే మేయర్, నిర్మాత: ప్రశాంతి తిపిర్నేని, రచన-దర్శకత్వం: శైలేష్ కొలను.