Mehreen | టాలీవుడ్లో తన అందం, నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మెహ్రీన్ పీర్జాదా ఇప్పుడు కొత్త జీవితాన్ని ఆస్వాదిస్తోంది. ఇటీవల అర్ష్ ఔలఖ్‌ను వివాహం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ, తాజాగా తన వివాహ వేడుక అనంతరం జరిగిన ప్రత్యేక వేడుకకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంది. ఈ చిత్రాల్లో మెహ్రీన్ కనిపించిన తీరు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్‌గా మారింది.“నక్షత్రాల్లో రాసిన రాత్రి” అంటూ మెహ్రీన్ తన భర్త అర్ష్‌తో కలిసి దిగిన ఫోటోలను పంచుకుంది. ఈ ఫోటోల్లో ఆమె ధరించిన ప్రత్యేకమైన దుస్తులు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. షాంపేన్ రంగులో రూపొందించిన ప్రత్యేక లెహంగా, దానిపై చేసిన నాజూకైన చేతిపని ఎంబ్రాయిడరీ ఆమెకు మరింత రాయల్ లుక్‌ను తీసుకొచ్చాయి.
ఈ ప్రత్యేక దుస్తులను ప్రముఖ పాకిస్థానీ డిజైనర్ రూపొందించినట్లు సమాచారం. లెహంగా పైభాగంలో జాకెట్ తరహాలో రూపొందించిన కేప్, దానికి సరిపోయే ఆభరణాలు మెహ్రీన్‌ను నిజంగానే ఓ యువరాణిలా చూపించాయి. ఆమె ధరించిన నగలు, మేకప్, హెయిర్ స్టైల్ అన్నీ కలిపి ఒక రాజసమైన పెళ్లి వేడుకను గుర్తు చేస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లోని అందమైన ప్రాంతాల్లో ఏప్రిల్ 26న వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
సినిమాల విషయానికి వస్తే, నాని హీరోగా నటించిన ‘కృష్ణగాడి వీర ప్రేమ గాధ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మెహ్రీన్, చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ‘మహానుభావుడు’, ‘రాజా ది గ్రేట్’, ‘ఎఫ్ 2’ వంటి చిత్రాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించింది. ముఖ్యంగా “హనీ ఈజ్ బెస్ట్” అనే డైలాగ్‌తో ఆమెకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఇప్పుడు పెళ్లి తర్వాత కూడా మెహ్రీన్ అదే అందం, హుందాతనంతో అభిమానులను ఆకట్టుకుంటోంది. ఆమె తాజా ఫోటోలను చూసిన అభిమానులు “చాలా అందంగా ఉన్నావు”, “రియల్ ప్రిన్సెస్‌లా కనిపిస్తున్నావు” అంటూ కామెంట్లు చేస్తున్నారు.