Pawan Kalyan |టాలీవుడ్ ప్లాప్ చిత్రాల దర్శకుడు మెహర్ రమేష్ చివరిగా చిరంజీవితో భోళా శంకర్ అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రం పెద్ద డిజాస్టర్ అయింది. ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ తో కచ్చితంగా సినిమా చేస్తానని అంటున్నారు. దాంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ షాక్ కి గురవుతున్నారు. ప్రస్తుతం మెహర్ రమేష్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియా అంతటా వైరల్‌గా మారాయి. మెహర్ రమేష్ తన కెరియర్ స్టార్టింగ్ లో ‘బిల్లా’ మూవీ తెరకెక్కించగా, ఈ చిత్రంతో సపరేట్ క్రేజ్ ఏర్పడింది. ఆ సినిమాలో ప్రభాస్‌ను చూపించిన విధానం, మెహర్ రమేష్ టేకింగ్ ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది.
దాంతో మెహర్ రమేష్ స్టార్ డైరెక్టర్ అవుతాడని అంతా అనుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు ఈ డైరెక్టర్ చేసే సినిమాలు టాలీవుడ్ లో ఘోర పరాజయం చవి చూశాయి. దీంతో చాలా సంవత్సరాల పాటు డైరెక్షన్ జోలికి వెళ్లలేదు మెహర్ రమేష్. అయితే మెగాస్టార్ చిరంజీవి.. మెహర్‌ని నమ్మి ఛాన్స్ ఇవ్వగా, ఆయన తెరకెక్కించిన ‘భోళా శంకర్’ కూడా డిజాస్టర్ కావడంతో దర్శకుడిగా ఈయనపై ఎన్నో విమర్శలు వచ్చాయి. సోషల్ మీడియాలో మెహర్ రమేష్ ని చాలా మంది ట్రోల్ కూడా చేశారు. మెహర్ రమేష్ దర్శకత్వంపై ఆడియన్స్ లో నెగెటివ్ ఒపీనియన్ వచ్చేసింది. అలాంటి ఈ డైరెక్టర్ ఇప్పుడు పవర్ స్టార్ ఫ్యాన్స్ ఉలిక్కిపడేలా ఫ్యూచర్లో కచ్చితంగా సినిమా చేస్తానని స్టేట్మెంట్ ఇచ్చాడు.
ఈ మధ్యే ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మెహర్ రమేష్ ఒకటికి రెండుసార్లు పవన్ కళ్యాణ్‌తో సినిమా విషయాన్ని నొక్కి వక్కాణించాడు. ఇది విని పవన్ కళ్యాణ్ కంగారు పడుతున్నారు. మెగా కుటుంబానికి మెహర్ రమేష్ బంధువు, అత్యంత సన్నిహితుడు కాగా, ఆ సాన్నిహిత్యంతోనే తన ట్రాక్ రికార్డు ఎలా ఉన్నప్పటికీ.. మెగాస్టార్ చిరంజీవి ఛాన్స్ ఇచ్చారు. ఈ సినిమాతో చిరుకి కూడా అవమానం జరిగింది. ఇక ఇప్పుడు చిరు తమ్ముడు పవన్ కళ్యాణ్‌తో సినిమా చేస్తానంటున్నాడు. సినిమా ఫిక్స్ అయింది అని అడిగితే, నేను ఫిక్సయ్యా. చిరంజీవి గారితో సినిమా చేయాలనుకున్నాను. చేశాను. పవన్ కళ్యాణ్ గారితో 100 పర్సంట్ సినిమా చేస్తా’’ అని గట్టిగా చెప్పాడు మెహర్. అయితే పవన్ ఉన్న ఈ బిజీ షెడ్యూల్లో మెహర్ రమేష్‌తో సినిమా చేసే ఛాన్స్ ఉంటుందా చూడాలి.