బిగ్ బాస్ షోతో అందరి మనసులు గెలుచుకున్న కంటెస్టెంట్స్ కొందరు వెబ్ సిరీస్‌లతో మరి కొందరు సినిమాలతో ఇంకొందరు వేరే వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.అయితే బిగ్‌బాస్ వేదికపై చిరంజీవి మనసు దోచి రూ.10 లక్షల చెక్కును అందుకున్న మెహబూబ్ కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’లో చిన్న పాత్ర దక్కించుకున్నాడని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.
బిగ్ బాస్ సీజన్-4 ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చిరు .. సోహైల్, దివి, మెహబూబ్‌లకు బంపర్ ఆఫర్లు ప్రకటించి ఆశ్చర్యంలో ముంచెత్తిన విషయం తెలిసిందే. సోహైల్ సినిమాలో ఒక అతిథిపాత్ర చేస్తానని, దివికి తన తర్వాత చిత్రంలో అవకాశం ఇస్తానని చెప్పగా, అనాథాశ్రమానికి మెహబూబ్ చేసిన సాయాన్ని చూసిన ఆయన వెంటనే రూ.10లక్షల చెక్కును మెహబూబ్‌కు బహుమతిగా చేతిలో పెట్టారు.
ఆచార్య సినిమాలో కూడా మెహబూబ్‌కి ఆఫర్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. ఆచార్య టీం నుండి నాకు కాల్ వచ్చింది. ఆఫీసుకి వెళ్లాను, నా రోల్ గురించి కూడా మాట్లాడాను. తర్వాత మళ్లీ కాల్ రాలేదు. కాల్ వస్తే మాత్రం కళ్లు మూసుకొని చేస్తాను. అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాను, డబ్బుల కోసం కాదని పేర్కొన్నాడు మెహబూబ్. ‘గుంటూరు మిర్చి’ అనే వెబ్ సిరీస్ చేస్తున్న మెహబూబ్ దీనిపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు.