Megham Varshinchada | టాలీవుడ్ యువ నటుడు విజయ రామరాజు టైటిల్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం‘అర్జున్ చక్రవర్తి’. ఇప్పటికే పలు అంతర్జాతీయ చలనచిత్ర వేదికలలో 46కి పైగా అవార్డులు గెలుచుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ‘మేఘం వర్షించదా’ అనే పాటను విడుదల చేశారు. విఘ్నేష్ బాస్కరన్ ఈ అందమైన ప్రేమ గీతాన్ని కంపోజ్ చేయగా.. విక్రాంత్ రుద్ర రాసిన సాహిత్యం మనసును హత్తుకునేలా ఉంది. కపిల్ కపిలన్, మీరా ప్రకాష్, సుజిత్ శ్రీధర్ తమ మ్యాజికల్ వాయిస్‌తో ఆకట్టుకున్నారు. ఈ పాటలో విజయరామరాజు, సిజా రోజ్ కెమిస్ట్రీ ఆకట్టుకునేలా ఉంది. అద్భుతమైన స్పోర్ట్స్ డ్రామాతో పాటు హార్ట్ టచింగ్ లవ్ స్టోరీతో ‘అర్జున్ చక్రవర్తి’ అలరించబోతుందని ఈ పాట తెలియజేస్తుంది. విజయ రామరాజు, సిజా రోజ్, హర్ష్ రోషన్, అజయ్, అజయ్ ఘోష్, దయానంద్ రెడ్డి, దుర్గేష్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
విక్రాంత్ రుద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాకి శ్రీని గుబ్బల నిర్మాతగా, ఈడే కృష్ణ చైతన్య సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రానికి విఘ్నేష్ బాస్కరన్ సంగీతం అందించగా, జగదీష్ చీకాటి సినిమాటోగ్రఫీ, ప్రదీప్ నందన్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. ఈ సినిమాకు కృష్ణకాంత్ సాహిత్యం, రవీంద్ర పుల్లె సంభాషణలు రాశారు. పూజిత తాడికొండ కాస్ట్యూమ్ డిజైనర్‌గా, విష్ణు వర్ధన్ కలర్స్ ని అందించారు. పబ్లిసిటీ డిజైన్ స్కేల్ & టిల్ట్ స్టూడియోస్, విఎఫ్ఎక్స్ మ్యాడ్‌హౌస్ విఎఫ్ఎక్స్ చేయగా, తేజస్వి సజ్జా పిఆర్ఓ గా వ్యవహరించారు, హాష్‌ట్యాగ్ మీడియా మార్కెటింగ్ బాధ్యతలు చూసుకుంది.