సుమంత్ శైలేంద్ర, మేఘా ఆకాష్ జంటగా నటిస్తున్న సినిమా ‘ఓం శ్రీ కనకదుర్గ’. లంకా శశిధర్ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ ప్రారంభమైంది. దర్శక నిర్మాత లంకా శశిధర్ మాట్లాడుతూ..‘లవ్, థ్రిల్లింగ్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. భారీ గ్రాఫిక్స్ ఉంటాయి. మంచి ప్లానింగ్‌తో సినిమా చేయబోతున్నాం. హైదరాబాద్, విజయవాడ తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ చేస్తాం’ అన్నారు.