మెగాస్టార్ సినిమా పనుల్లో బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి బిజీబిజీగా ఉన్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ వైజాగ్‌లో జరుగుతున్నది. ఈ సినిమా షూటింగ్‌ను ఓ సాంగ్‌తో మొదలుపెట్టనున్నారట అనిల్. మే నెలలో ఈ సాంగ్ షూటింగ్ ఉంటుందని తెలుస్తున్నది. టాకీ పార్ట్‌ని జూన్ నుంచి మొదలుపెడతారట. ఇదిలావుంటే.. ఈ సినిమాకు పనిచేసే టెక్నీషియన్స్ అందర్నీ దాదాపుగా ఖరారు చేసేశారట అనిల్ రావిపూడి.
తన కెరీర్లోనే గుర్తుండిపోయే హిట్‌గా నిలచిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్సే ఈ మెగా ప్రాజెక్ట్‌కి కూడా పనిచేస్తారని సమాచారం. భీమ్స్ సిసిరోలియో సంగీతం, సమీర్‌రెడ్డి సినిమాటోగ్రఫీ, తిమ్మరాజు ఎడిటింగ్‌తోపాటు డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా మొత్తం ‘సంక్రాంతికి వస్తున్నాం’ టీమే ఉంటుందని తెలుస్తున్నది.
ఆడియన్స్ మిస్ అవుతున్న చిరంజీవి మార్క్ కామెడీ జానర్‌ను అనిల్ రావిపూడి ైస్టెల్లో ఆవిష్కరించేందుకు కరసత్తులు జరుగుతున్నాయని, 90ల్లో నాటి చిరంజీవి గ్రేస్‌ని ఈ సినిమాలో చూస్తారని చిత్రబృందం చెబుతున్నది. ఇక ఇందులో మెగాస్టార్‌కి జోడీగా నటించే హీరోయిన్, ఇతర పాత్రధారుల వివరాలు మాత్రం తెలియాల్సివుంది. షైన్‌స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి ఈ సినిమాను నిర్మిస్తున్న విషయం తెలిసిందే.