80s Stars Reunion In Chennai | దక్షిణాది సినిమా పరిశ్రమలో 1980వ దశకంలో ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్డమ్ని అనుభవించిన నటీనటులందరూ ప్రతి సంవత్సరం ’80s Stars Reunion’ పేరిటా కలుసుకుంటారన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది కూడా ఈ స్టార్ నటులందరూ ఒకేచోట కలిశారు. టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవితో పాటు విక్టరీ వెంకటేశ్, నరేష్ తదితరులు హాజరుకాగా.. ఇతర ఇండస్ట్రీల నుంచి పలువురు స్టార్ నటులు ఈ వేడుకకు హాజరయ్యారు. ఇక అందరూ కలిసి ఒకే డ్రెస్ కోడ్లో హాజరయినట్లు ఫొటోలు చూస్తే అర్థమవుతుంది. అయితే ఈ వేడుకపై చిరంజీవి ఎక్స్ వేదికగా ప్రత్యేక పోస్ట్ పెట్టాడు.
80 దశకంలో నాతో కెరీర్ ప్రారంభించిన నా ప్రియమైన స్నేహితులతో ప్రతి రీయూనియన్ జ్ఞాపకాల వీధిలో ఒక నడకలా ఉంటుంది. నవ్వు, వెచ్చదనం మరియు దశాబ్దాలుగా మనం పంచుకున్న అదే విడదీయరాని బంధంతో నిండి ఉంటుంది. ఎన్నో మధురమైన జ్ఞాపకాలు, ఇంకా ఎన్నో అంటూ చిరు రాసుకోచ్చాడు.
80s Star Reunion
80sstarsreunion