Megastar Chiranjeevi | యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా మారుతీ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. థ్రిల్లర్, రొమాంటిక్ అంశాలతో నిండిన వినోదాత్మక చిత్రంగా దీన్ని రూపొందిస్తున్నారు. ఇందులో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం చిత్రీకరణ దశలో వుంది.
కాగా ఈ సినిమా సెట్స్ పై ఉండగానే దర్శకుడు మారుతి చేయబోయే కొత్త సినిమా కబుర్లు బయటికి వచ్చింది. మెగాస్టార్ చిరంజీవీతో మారుతి ఎప్పటినుంచో ఓ సినిమా చేయాలని ఆసక్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడా సినిమా విషయంలో మెగాస్టార్ చిరంజీవి నుంచి మారుతికి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని సమాచారం.
ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు చిరంజీవి. ఈ సినిమాతో పాటే చిరు తనయ సుస్మిత నిర్మాణంలో ఓ సినిమా వుంటుందని ప్రకటించారు. ఈ చిత్రానికి దర్శకుడిగా సోగ్గాడే చిన్ని నాయన ఫేమ్ కళ్యాణ్ కృష్ణని (Soggade Chinni Nayana) అనుకున్నారు. అయితే తర్వాత ఏం జరిగిందో గానీ ఈ సినిమా గురించి మరో అప్డేట్ ఇవ్వలేదు. ఇప్పుడు మారుతి సినిమా ఓకే అయినట్లు కథనాలు వస్తున్నాయి. మరి కళ్యాణ్ కృష్ణ సినిమా ఎప్పుడనేది తెలియాలంటే సుస్మిత ప్రొడక్షన్ హౌస్ నుంచి ఓ ప్రకటన రావాలి.