వైవిధ్యమైన చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్‌గా మారిన క్రిష్ తెరకెక్కించిన తాజా చిత్రం కొండ పొలం. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన ‘కొండపొలం’ నవలను ఆధారంగా చేసుకుని వైష్ణవ్, రకుల్ జోడీగా క్రిష్ ఈ సినిమాను తెరకెక్కించారు. కోవిడ్ సమయంలో షూటింగ్స్ చేసుకోవడానికి అనుమతులు ఇచ్చినప్పుడు పరిమిత సంఖ్యలోని కాస్ట్ అండ్ క్రూతో, ప్రభుత్వ నియమ నిబంధనలను పాటిస్తూ ‘కొండపొలం’ చిత్రాన్ని రూపొందించారు డైరెక్టర్ క్రిష్.
నేడు విడుదల కానున్న ఈ చిత్రాన్ని చిరంజీవి ఓ రోజు ముందే తన కుటుంబంతో కలిసి వీక్షించారు.ఈ సందర్భంగా మాట్లాడిన చిరంజీవి.. క్రిష్ సినిమాలంటే డిఫరెంట్ జోనర్ మూవీస్ అని అనుకుంటాం. ఈ సినిమాకు చూసిన వారు థ్రిల్‌కు లోనవుతారనే మాట వాస్తవం. నేనైతే కొండపొలంకు సంబంధించిన పుస్తకం ఏదీ చదవలేదు. వైష్ణవ్ ఓరోజు నా దగ్గరకు వచ్చి ‘మామ..ఇలా క్రిష్‌గారి దర్శకత్వంలో ‘కొండపొలం’ అనే సినిమా చేస్తున్నాను’ అనగానే.. నేను ‘వెంటనే సినిమా చెయ్ అనేశాను.
క్రిష్ డైరెక్షన్లో సినిమా అంటే కాస్త వెరైటీ ఉంటుంది. మంచి పెర్ఫామెన్స్‌కు స్కోప్ ఉంటుంది. సినిమాలో మంచి ఎమోషన్‌కు ఛాన్స్ ఉంటుంది’ అని నేను వైష్ణవ్‌తో చెప్పాను . నేనెదైతే అన్నానో.. వైష్ణవ్ తేజ్ పెర్ఫామెన్స్ కానీ, క్యారెక్టరైజేషన్ కానీ అన్నీ డిఫరెంట్‌గా ఉన్నాయి. క్రిష్ సినిమాలను నేను ముందు నుంచి చూస్తూ వస్తున్నాను. ఒక సినిమాకు మరో సినిమాకు సంబంధం ఉండదు. ‘కొండపొలం’ చిత్రం చక్కటి రస్టిక్ లవ్‌స్టోరి. ఈ ప్రకృతిని ఎలా కాపాడుకోవాలో చెప్పిన కథాంశం. మంచి మెసేజ్‌తో కూడిన లవ్‌స్టోరి.
వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ బాగా ఎంజాయ్ చేశాను. ఇలాంటి సినిమాలను ప్రేక్షకులు ఆహ్వానించాలి, ఆదరించాలి. ‘కొండపొలం’ మూవీ తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను తెలియజేస్తూ చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ అందించారు చిరు.
The first review is the Mega review ! 💥
— Mohan Superhit (@mohankumaar82) October 8, 2021
Megastar @KChiruTweets garu's heartfelt wishes and his review of the epic #KondaPolam !#PanjaVaisshnavTej @RakulPreet @DirKrish @mmkeeravaani @Gnanashekarvs @YRajeevReddy1 #JSaiBabu @FirstFrame_ent @MangoMusicLabel pic.twitter.com/IwWt06akXQ