‘గాడ్‌ఫాదర్’ విజయంతో ద్విగుణీకృతమైన ఉత్సాహంతో ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. వినూత్న కథల్ని ఎంపిక చేసుకోవడానికి ఈ సినిమా స్ఫూర్తినిచ్చిందని చెప్పారు. ఇదే ఒరవడిలో భవిష్యత్తులో వైవిధ్యమైన ఇతివృత్తాల్ని ఎంచుకొని ప్రేక్షకుల్ని అలరిస్తానని మాటిచ్చారు. ఇటీవల విడుదలైన ‘గాడ్‌ఫాదర్’ చిత్రానికి చక్కటి ఆదరణ లభిస్తున్నది. ఈ నేపథ్యంలో అగ్ర నటుడు చిరంజీవి సినిమా విజయానందాన్ని పాత్రికేయులతో పంచుకున్నారు. ఇండస్ట్రీ సంగతులతో పాటు రాజకీయాంశాలపై తన అంతరంగాన్ని ఆవిష్కరించారు.
సినిమా అంటేనే సమిష్టి కృషి. జయాపజయాల్ని ఏ ఒక్కరికో ఆపాదించొద్దని నేను బలంగా నమ్ముతాను. విజయాలకు ఏమాత్రం పొంగిపోను. అపజయాలకు అస్సలు కుంగిపోను. ‘గాడ్‌ఫాదర్’ విజయం కూడా కేవలం నా ఒక్కడిదే అనుకోవడం లేదు. ‘ఆచార్య’ ఫెయిల్యూర్ గురించి కూడా పెద్దగా ఆలోచించలేదు. ఆ సినిమా విషయంలో నా బాధ్యతను పరిపూర్ణంగా నిర్వర్తించాను. ఏం చేశానో చెప్పుకుంటే అది చిన్నదైపోతుంది. ఆ సినిమా కోసం నేను, చరణ్ చాలా పెద్ద మొత్తం వదులుకున్నాం. ఫలితం ఏమైనా సరే నిర్మాతల్ని, బయ్యర్లను ఆదుకున్నామనే సంతృప్తి మాత్రం మిగిలిపోయింది.
‘లూసిఫర్’ చూసినప్పుడు తొలుత అంత ఆసక్తిగా అనిపించలేదు. కేరళ నేటివిటీతో అక్కడి రాజకీయాల్ని ప్రతిబింబించిన కథగా ఫీలయ్యా. తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ కాదేమో అనుకున్నా. అయితే కొన్ని రోజుల తర్వాత సినిమా గురించి పునరాలోచన చేశాను. ‘ఇలాంటి కథల్లో నన్ను ప్రేక్షకులు స్వీకరిస్తే కొత్తదనంతో కూడిన మరిన్ని వైవిధ్యమైన కాన్సెప్ట్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు’ అనుకున్నా. రామ్‌చరణ్ సలహాతోనే మోహన్‌రాజాను దర్శకుడిగా ఎంపిక చేసుకున్నాం.
వాళ్లు చాలా హ్యాపీగా ఉన్నారు. ఫైట్స్, పాటలు లేనవి, ైక్లెమాక్స్‌లో నేను కాకుండా సల్మాన్‌ఖాన్‌పై యాక్షన్ సీక్వెన్ ఉందని ఏ ఒక్కరూ నెగెటివ్‌గా కామెంట్స్ చేయలేదు. సినిమా చూసినప్పుడు పాటలు లేవనే భావనే రాలేదు. దానికి కారణం సంగీత దర్శకుడు తమన్. తన నేపథ్య సంగీతంతో సినిమాకు ప్రాణం పోశాడు. నా ఇమేజ్‌కు తగినట్లుగా ఉంటుందని ‘గాడ్‌ఫాదర్’ టైటిల్‌ను కూడా అతనే సూచించాడు.
కాలక్రమేణా ప్రేక్షకుల అభిరుచుల్లో మార్పు వస్తున్నది. బలమైన కథ, భావోద్వేగాలున్న సినిమాల్ని ఆదరిస్తున్నారు. అందుకు తగినట్లే ‘గాడ్‌ఫాదర్’ను తీశాం. మరిన్ని వినూత్నమైన కథలు రావడానికి ఇదొక గొప్ప సంకేతంగా భావిస్తున్నా. ఇదే ఒరవడిలో భవిష్యత్తులో కూడా వైవిధ్యమైన కథల్ని ఎంచుకొని ప్రయాణం సాగిస్తాను.
మీ కెరీర్లో ఎన్నో విజయాల్ని చూశారు. నటుడిగా పేరుప్రఖ్యాతులు సంపాదించారు. ప్రస్తుతం ఇండస్ట్రీ పెద్దగా ఉన్నారు.
అభిమానులు, ప్రజలు, ఇండస్ట్రీ మీద ఉన్న కృతజ్ఞతా భావమే నన్ను ముందుకు నడిపిస్తున్నది. అభిమానుల ప్రేమాభిమానాల వల్లే నేనీ స్థాయిలో ఉన్నా. నా కృతజ్ఞతను మాటల రూపంలో కాకుండా చేతలో రూపంలో తీర్చుకోవాలని ప్రయత్నిస్తున్నా. కృతజ్ఞతా పూర్వకంగానే ఈ బాధ్యతల్నింటిని నిర్వర్తిస్తున్నాను.
తప్పకుండా ఇతర భాషా చిత్రాల్లో నటిస్తా. సినిమాల విషయంలో భాషాపరమైన హద్దులు చెరిగిపోవాలి. ఏ ప్రాంతీయ భాషలో రూపొందించిన చిత్రమైనా ఇండియన్ సినిమా అని పేరు తెచ్చుకోవాలి. బాహుబలి, కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో భారతీయ సినిమా ఎల్లలు చెరిగిపోయాయి.
ఒకవేళ నేను నాటి రాజకీయ పరిస్థితిని యథాతథంగా కొనసాగించి ఉంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే పరిమితమైపోయేవాడిని. నేడు ఉభయ తెలుగు రాష్ర్టాల ప్రజలు నన్ను ఆదరిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితే బెటర్‌గా అనిపిస్తున్నది. ఆనాడు నేను తీసుకున్న రాజకీయ నిర్ణయం గురించి ఎలాంటి పశ్చాత్తాపం లేదు. ఓ రకంగా చెప్పాలంటే మరింత హ్యాపీగా ఫీలవుతున్నాను.
పరిస్థితులు ఏలాంటివైనా నేను సంయమనం పాటిస్తా. నిజానిజాలు నిలకడమీద తెలుస్తాయనే నానుడిని నేను బాగా నమ్ముతాను. మనపై తప్పుడు అభియోగాలు మోపితే వెంటనే వాటిపై తీవ్రంగా స్పంది ంచడం నాకు ఇష్టం ఉండదు. ఒకప్పుడు నన్ను విమర్శించిన వారే తప్పు తెలుసుకొని నాతో పనిచేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నా బ్యాంక్ బ్యాలెన్స్‌లో ఒకటి పక్కన ఎన్ని సున్నాల్ని చేర్చుకుంటూ వెళ్లానన్నది కాదు.. ఎంతమంది హృదయాలకు దగ్గరయ్యానన్నదే నాకు ము ఖ్యం. అలాగే గతం తాలూకు విద్వేషాల్ని మనసులో పెట్టుకోకుండా శత్రువుని కూడా ఆలింగనం చేసుకోవాలన్నదే నా ఫిలాసఫీ. అందుకే నేను అందరి మనసులు గెలిచిన వాడిగా మిగిలిపోయా.