Vishwak Sen Laila Movie | విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘లైలా’. ఈ సినిమాకు రామ్ నారాయణ్ దర్శకత్వం వహిస్తుండగా.. సాహు గార్లపాటి నిర్మిస్తున్నారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే మూవీ నుంచి టీజర్‌తో పాటు ట్రైలర్‌ను విడుదల చేయగా.. మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. అయితే ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకకు చిరంజీవి ముఖ్య అతిథిగా రాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.
నేడు మెగాస్టార్ ఇంటికి వెళ్లిన నటుడు విశ్వక్సేన్, నిర్మాత సాహు గారపాటి చిరంజీవిని కలిసి ప్రీ రిలీజ్ వేడుకకు ఆహ్వానించారు. అనంతరం విశ్వక్ చిరుకి గజమాలతో సన్మానించి హన్మాన్ విగ్రహాం బహుకరించాడు. కాగా ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి.
A MEGA EVENT LOADING 🔜
‘Mass Ka Das’ @VishwakSenActor & our producer @sahugarapati7 met MEGASTAR @KChiruTweets Garu and cordially invited him to the #Laila pre release event as the chief guest 🌟
More details soon! Stay tuned 💥#LailaTrailer TRENDING #1 on YouTube 🔥
▶️… pic.twitter.com/VpNC5LIlOW— Shine Screens (@Shine_Screens) February 7, 2025