Megastar Chiranjeevi – Heavy Rains | తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఇవాళ, రేపు కూడా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అటు అమరావతితో ఇటు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపాయి. ఇక భారీ వర్షాల వలన తెలుగు రాష్ట్రాల్లోని చాలా గ్రామాలు వరదలతో అతలాకుతలం అవుతున్న విషయం తెలిసిందే. భారీ వరదల వలన లోతట్టు గ్రామల ప్రజలతో పాటు ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు.
తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. పలు గ్రామాలు, జాతీయ రహదారులు నీటితో మునిగిపోయాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మీ కుటుంబ సభ్యుడిగా నా మనవి ఒక్కటే… అత్యవసరం అయితే తప్ప ఎవరు ఇంటి నుంచి బయటకు రావద్దు. వైరల్ ఫీవర్ వంటివి వచ్చే ప్రమాదం ఉండటం వల్ల అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు ప్రజలకు, బాధితులకు మా అభిమానులు ఎల్లప్పుడూ అండగా ఉంటూ వస్తున్నారు. ఇప్పుడూ అభిమానులంతా అండగా ఉంటారని ఆశిస్తున్నాను అంటూ చిరు రాసుకోచ్చాడు.
తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. పలు గ్రామాలు, జాతీయ రహదారులు నీటితో మునిగిపోయాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
మీ కుటుంబ సభ్యుడిగా నా మనవి ఒక్కటే… అత్యవసరం అయితే తప్ప ఎవరు ఇంటి నుంచి బయటకు రావద్దు. వైరల్ ఫీవర్ వంటివి వచ్చే ప్రమాదం ఉండటం…
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 1, 2024