అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా సినిమా అనే వార్త వచ్చిన నాటి నుంచీ.. ఈ సినిమా సెట్స్‌కి ఎప్పుడెళ్తుందా!.. అని ప్రతి అభిమానీ ఆతృతతో ఎదురు చూస్తూనే ఉన్నారు. ఆ ఎదురు చూపులకు తెర దించుతూ శుక్రవారం హైదరాబాద్‌లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. చిరంజీవితోపాటు ఇతర నటీనటులపై కీలకమైన సన్నివేశాలను అనిల్ రావిపూడి చిత్రీకరించడం ప్రారంభించారు.
అనిల్ కామెడీకి మెగా టైమింగ్ తోడైతే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూస్తారని, థియేటర్లన్నీ నవ్వుల్తో దద్దరిల్లిపోయేలా అద్భుతమైన స్క్రిప్ట్‌ని అనిల్ రావిపూడి సిద్ధం చేశారని, చిరంజీవి పూర్తి హ్యూమరస్ క్యారెక్టర్లో కనిపించబోతున్నారని, ఫుల్ జోష్‌తో లొకేషన్‌కి మెగాస్టార్ ఎంట్రీ ఇచ్చారని నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత కొణిదెల తెలిపారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ సినిమాలో నయనతార కథానాయికగా నటిస్తున్నది. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో, సమర్పణ: శ్రీమతి అర్చన. నిర్మాణం: షైన్ స్క్రీన్స్ అండ్ గోల్డ్ బాక్స్ ఎంటైర్టెన్మెంట్స్.