లూసిఫర్ రీమేక్ విషయంలో చిరంజీవి అసంతృప్తి
లూసిఫర్ రీమేక్ | మోహన్ రాజా ఈ చిత్రం కోసం స్క్రిప్ట్ కూడా పూర్తి చేశాడు. తెలుగులో మోహన్ రాజా సిద్ధం చేసిన స్క్రీన్ ప్లేలో చిరుకు కొన్ని నచ్చట్లేదని తెలుస్తుంది.

చిరంజీవి ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తున్నాడు. అయితే అందులో ఎక్కువ రీమేక్ కథలే ఉన్నాయి. మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ రీమేక్‌తో పాటు వేదాళం రీమేక్‌లో మెగాస్టార్ నటించబోతున్నాడు. నిజానికి ఏప్రిల్‌లోనే లూసిఫర్ రీమేక్ షూటింగ్ మొదలు పెట్టాలనుకున్నాడు చిరంజీవి. ఈ సినిమా కోసం మోహన్ రాజా స్క్రిప్ట్ కూడా పూర్తి చేశాడు. అయితే ఈ లూసిఫర్ రీమేక్ స్క్రిప్టు విషయంలో చిరు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.
2019లో సైరా సినిమాతో వచ్చిన చిరంజీవి.. 2020లో రెండు సినిమాలతో రావాలనుకున్నాడు. కానీ ఒక ఏడాది మొత్తం కరోనాకే పోయింది. ఆచార్యను త్వరగా పూర్తి చేయాలని చిరు భావించినా కూడా కరోనా మాత్రం పగ బట్టేసింది. దాంతో చాలా ఆలస్యం అయిపోయింది. చివరకు షూటింగ్ పూర్తి చేసి ఈ సినిమాను మే 13న విడుదల చేయాలని అనుకున్నారు దర్శక నిర్మాతలు. కానీ కరోనా నేపథ్యంలో ఈ సినిమా అప్పుడు కూడా విడుదలయ్యే అవకాశమే కనిపించడం లేదు. ఇదిలా ఉంటే లూసీఫర్ రీమేక్ లోనూ నటిస్తున్నాడు చిరంజీవి. ఈ చిత్ర షూటింగ్ ఏప్రిల్ లోనే మొదలు పెట్టాలనుకున్నాడు మెగాస్టార్. మోహన్ రాజా ఈ చిత్రం కోసం స్క్రిప్ట్ కూడా పూర్తి చేశాడు. అయితే ఇప్పుడు ఈ చిత్రం మరికొన్ని నెలలు ఆలస్యం అయ్యేలా కనిపిస్తుంది. దానికి కేవలం కరోనా మాత్రమే కారణం కాదు.. కథ కూడా.
తెలుగులో మోహన్ రాజా సిద్ధం చేసిన స్క్రీన్ ప్లేలో చిరుకు కొన్ని నచ్చట్లేదని తెలుస్తుంది. స్క్రిప్ట్ వర్క్ పై పూర్తిగా సంతృప్తిగా మాత్రం లేడని ప్రచారం జరుగుతుంది. అందుకే కథపై మరోసారి కూర్చోవాలని దర్శకుడిని కోరినట్లు తెలుస్తుంది. ఎలాగూ అయ్యే ఆలస్యం అవుతుంది కదా.. ఎన్ని రోజులైనా కథపై కూర్చోవాలని సూచించాడు మెగాస్టార్. దాంతో మోహన్ రాజా కథపై మరోసారి సిట్టింగ్స్ వేస్తున్నాడు.
చిరు దర్శకుల లిస్టులో ఇంకా మెహర్ రమేష్ కూడా ఉన్నాడు. ఈయన వేదాళం రీమేక్ చేస్తున్నాడు. ఇన్ని సినిమాలు చిరంజీవి ఎప్పటికి పూర్తి చేస్తాడో అర్థం కావడం లేదు. వరసగా సినిమాలు కమిటై.. ఏడాదికి రెండు ప్రాజెక్టులు విడుదల చేద్దామని ఫిక్సైపోతే కాలం మాత్రం కలిసిరావడం లేదు. పాపం అన్నీ బాగానే ఉన్నా.. కాలం కలిసిరాకపోతే దానికి మెగాస్టార్ మాత్రం ఏం చేస్తాడు చెప్పండి అంటున్నారు అభిమానులు. ఆచార్య ఈ ఏడాది వస్తే లూసీఫర్, వేదాళం రీమేక్స్ 2022లో విడుదల చేయాలని అనుకుంటున్నాడు చిరంజీవి. చూడాలి మరి.. అప్పటికి కాలం కరుణిస్తుందో లేదో..? వీటితో పాటు బాబీ సినిమాకు కూడా కమిట్ మెంట్ ఇచ్చాడు చిరంజీవి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
కూతుర్ని గుండెలపై ఎక్కించుకున్న అల్లు అర్జున్.. వైరల్ పిక్
పుకార్లపై నవ్వుకున్న హరీష్ శంకర్..ఇంతకీ అదేంటంటే..?
రామ్ చరణ్ రంగస్థలం తమిళ ట్రైలర్ రిలీజ్
శ్రీ రామ నవమికి విడుదలైన సినిమా పోస్టర్స్ ఇవే..
మరోసారి ఇద్దరు భామలతో రొమాన్స్..!
రజనీకాంత్ అన్నాత్తే షూటింగ్‌కు కర్ఫ్యూ కష్టాలు
ఒకేసారి థియేటర్లో, ఆన్లైన్లో రిలీజ్ కానున్న రాధే
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

