చిరంజీవి సినిమాపై ఈ కన్ఫ్యూజన్ ఇంకెన్ని రోజులో.. ?
చిరంజీవి కెరీర్లో ఎప్పుడూ లేనివిధంగా ఓ సినిమాపై ఇప్పుడు చాలా కన్ప్యూజన్స్ వస్తున్నాయి. సినిమా ఇంకా మొదలు కూడా కాకముందే దర్శకుల విషయంలో చాలా వార్తలు వినిపిస్తున్నాయి

చిరంజీవి కెరీర్లో ఎప్పుడూ లేనివిధంగా ఓ సినిమాపై ఇప్పుడు చాలా కన్ప్యూజన్స్ వస్తున్నాయి. సినిమా ఇంకా మొదలు కూడా కాకముందే దర్శకుల విషయంలో చాలా వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆ సినిమా గురించి రోజుకో వార్త పుట్టుకొస్తుంది. అభిమానుల్లో కూడా అసలేం జరుగుతుందో తెలియని ఒక రకమైన సందిగ్ధత ఏర్పడింది. ఆ సినిమానే లూసీఫర్ రీమేక్. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలని చిరు భావించాడు. అనుకున్నదే తడువుగా రీమేక్ హక్కులు తీసుకున్నాడు. ఈ సినిమా తెలుగులో విడుదలైనా కూడా మళ్లీ రీమేక్ చేయాలని చూస్తున్నాడు మెగాస్టార్.
మోహన్ లాల్ హీరోగా నటించిన ఈ పొలిటికల్ ఎంటర్టైనర్ను పృథ్విరాజ్ సుకుమారన్ తెరకెక్కించాడు. తొలి సినిమాతోనే అదిరిపోయే బ్లాక్ బస్టర్ అందుకున్నాడు ఈ హీరో కమ్ డైరెక్టర్. అంతా బాగానే ఉంది కానీ తెలుగులో ఈ సినిమా రీమేక్ విషయంలో మాత్రం ఇంకా అదే కన్ఫ్యూజన్ నడుస్తుంది. ఈ సినిమా రీమేక్ బాధ్యతలను ముందుగా సుజీత్‌కు అప్పగించాడు మెగాస్టార్. ఆ తర్వాత ఈ సినిమాకు వినాయక్ ను డైరెక్టర్‌గా అనుకున్నారు. కొద్దిరోజులకే హరీష్ శంకర్ లూసీఫర్ సినిమాను రీమేక్ చేయబోతున్నాడని వార్తలు వచ్చాయి. అలాంటి సమయంలో అన్ని అనుమానాలకు తెరదించుతూ మోహన్ రాజాకు ఈ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాడు చిరంజీవి.
అప్పుడెప్పుడో హనుమాన్ జంక్షన్ తర్వాత తెలుగు సినిమాలు చేయని రాజా.. ఇన్నేళ్లకు చిరు అవకాశం అందుకున్నాడు. రీమేక్ స్పెషలిస్టు కావడంతో ఈ ఛాన్స్ ఇచ్చాడని అందరికీ అర్థమైంది కూడా. అయితే ఇన్ని రోజులు సినిమాపై వర్క్ చేసినా కూడా ఇప్పటికీ ఫైనల్ నెరేషన్ పై ఎందుకో మరి చిరు అసంతృప్తిగానే ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. స్క్రిప్ట్ విషయంలో ఎక్కడో చిరు అన్యమనస్కంగానే ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై స్వయంగా చిరంజీవి బయటికి వచ్చి నోరు విప్పితే కానీ ఈ కన్ఫ్యూజన్ కు తెర పడేలా కనిపించడం లేదు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
‘ఆదిపురుష్’లో హనుమంతుడు ఇతడే..!
19 ఏళ్ల కెరీర్ లో నితిన్ వదిలేసిన సినిమాలివే..!
‘మా’ ఎన్నికలు..ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ సభ్యులు వీళ్లే
సెట్లో సన్నీలియోన్ రిలాక్సింగ్ మూడ్..వీడియో
‘పెళ్లికి ముందే శృంగారం’పై అనురాగ్‌కు కూతురి ప్రశ్న..వీడియో వైరల్
మరో బిజినెస్ వైపు సమంత అడుగులు..!
నా బాయ్‌ఫ్రెండ్ కు క్రెడిట్ ఇవ్వాలి: అవికా గోర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

