RamCharan | మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో వచ్చిన మోస్ట్ అవైటెడ్ మూవీ “పెద్ది” బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. గత కొంతకాలంగా టాలీవుడ్ ఎదురుచూస్తున్న భారీ విజయాన్ని అందిస్తూ, ఈ చిత్రం ఇప్పటికే 350 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ రాబట్టి ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. అయితే, సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అయినప్పటికీ కొన్ని ప్రాంతాల నుంచి వచ్చిన ప్రేక్షకుల ఫీడ్‌బ్యాక్, విమర్శలను దర్శకుడు బుచ్చిబాబు సానా పాజిటివ్‌గా తీసుకున్నారు. వాటిని సరిదిద్ది ప్రేక్షకులకు మరింత మెరుగైన థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అందించేందుకు మేకర్స్ సరికొత్త మార్పులు చేసినట్టు తెలుస్తోంది.
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమాను రీ-ఎడిట్ చేసి సరికొత్త వెర్షన్‌ను ఈ శనివారం నుంచే థియేటర్లలో ప్రదర్శించనున్నారు. ముఖ్యంగా సెకండాఫ్‌లో హీరోయిన్ జాన్వీ కపూర్‌పై ఉన్న కొన్ని ల్యాగ్ సీన్లను తగ్గించి, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో కొన్ని కీలకమైన, ఆసక్తికరమైన కొత్త సన్నివేశాలను జోడించబోతున్నట్లు సమాచారం. ఈ తాజా వెర్షన్ తో సినిమా వేగం మరింత పెరగనుందని ఇండస్ట్రీ టాక్. అయితే ఈ సరికొత్త మార్పులపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.