Boxoffice Champion | మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, బ్లాక్‌బస్టర్ దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్లో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద నాన్‌స్టాప్‌గా దూసుకుపోతోంది. జూన్ 4న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ కేవలం మూడు రోజుల్లోనే రూ. 236.7 కోట్ల భారీ గ్రాస్ వసూళ్లను సాధించి సరికొత్త రికార్డులను నెలకొల్పింది. నిర్మాణ సంస్థ ప్రకటించిన వివరాల ప్రకారం.. ఈ చిత్రం మొదటి రోజే రూ. 135.36 కోట్ల భారీ ఓపెనింగ్స్‌తో ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత కూడా అదే జోరును కొనసాగిస్తూ రెండో రోజు రూ. 46.44 కోట్లు, మూడో రోజు రూ. 54.90 కోట్లు రాబట్టి మొత్తం 3 రోజుల్లో రూ. 236.7 కోట్ల మార్క్‌ను దాటేసింది. ఓవర్సీస్ మార్కెట్లోనూ రామ్ చరణ్ తన బాక్సాఫీస్ స్టామినాను మరోసారి నిరూపించుకున్నారు, కేవలం నార్త్ అమెరికాలోనే ఈ చిత్రం ఇప్పటికే 2.2 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లను సాధించి ప్రభంజనం సృష్టిస్తోంది.
మరోవైపు టికెట్ బుకింగ్స్ యాప్ ‘బుక్ మై షో’లో సైతం ఈ చిత్రం సరికొత్త చరిత్ర సృష్టించింది. కేవలం రెండున్నర రోజుల్లోనే 2 మిలియన్లకు పైగా టికెట్లు అమ్ముడై, గతంలో ‘RRR’ చిత్రం క్రియేట్ చేసిన ఆల్‌టైమ్ రికార్డులను సమం చేయడం విశేషం. 1980ల నాటి గ్రామీణ ఆంధ్రా నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో రామ్ చరణ్ నటన, ఉత్తేజపరిచే కుస్తీ మరియు క్రికెట్ సీక్వెన్సులు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. వీటికి తోడు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన అద్భుతమైన సంగీతం, కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్ నటన థియేటర్లలో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తున్నాయి. బాక్సాఫీస్ ఛాంపియన్ ‘పెద్ది’ అప్రతిహతంగా దూసుకుపోతోందని, ప్రేక్షకులు తమ టికెట్లను ఇప్పుడే బుక్ చేసుకోవాలని చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేసింది.