Mega Heroine | ఈ మధ్య ట్రెండ్ మారింది. పెళ్లికి ముందే కొందరు తల్లులు అవుతున్నారు. పిల్లలు పుట్టాక కొందరు భామలు పెళ్లిళ్లు చేసుకోవడం మనం చూశాం. తాజాగా ఓ బ్యూటీ పెళ్లి కాకుండా బేబీ బంప్ తో కనిపించి అందరు షాక్ అయ్యేలా చేసింది. ఆమె ఎవరంటే కోలీవుడ్ కుర్ర భామ ఐశ్వర్య లక్ష్మీ. తమిళ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ త్వరలో తెలుగు ప్రేక్షకులని పలకరించబోతుంది. హీరోయిన్గా మాత్రమే కాకుండా, వైవిధ్యమైన పాత్రలతో ఆడియెన్స్‌ను అలరించిన ఈ అమ్మడు.. మర్డర్, మిస్టరీ వంటి ఎమోషనల్ డ్రామా వంటి కథల్లో నటించి మెప్పించింది. ఆమె పాత్రలకి ప్రేక్షకులు ఇట్టే కనెక్ట్ అయ్యేవారు.
అయితే ఈ అందాల తార ఇప్పుడు బేబీ బంప్‌తో కనిపించడం కలకలం రేపుతుంది. ప్రస్తుతం ఐశ్వర్య లక్ష్మీ సాయి ధరమ్ తేజ్ సరసన సంబరాల ఏటి గట్టు అనే సినిమాలో నటిస్తుంది. అంతకు ముందు సత్యదేవ్ తో కలిసి గాడ్సే అనే సినిమా చేసింది. ఈ బ్యూటీ బేబి బంప్ పిక్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుండడంతో అందరు షాక్ అవుతున్నారు. అదేంటి పెళ్లి వార్త ఏమీ రాలేదు.. కానీ బేబీ బంప్ ఏంటీ? , ఏం జరుగుతోంది? అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఆమె సీమంతానికి సంబంధించిన ఫొటోలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ఐశ్వర్య ప్రస్తుతం తమిళ్ లో సూరితో కలిసి మామన్ అనే సినిమా చేస్తుంది. మామన్ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ కూడా జెట్ స్పీడ్ తో జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే సినిమా సెట్ లో దిగిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతుండగా, ఇవి చూసి నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. మామన్ అనే సినిమా ఓ సాంఘిక నేపథ్యంతో తెరకెక్కుతున్న పవర్ఫుల్ డ్రామా కాగా, ఇందులో ఐశ్వర్య ఓ గర్భిణీ పాత్రలో నటిస్తోంది. ఈ పాత్ర కోసం ఆమె స్పెషల్ గెటప్‌లో, బేబీ బంప్‌తో కనిపించాల్సి వచ్చింది.