Vishwambhara | మెగా అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘విశ్వంభర’. ‘బింబిసార’ఫేం మల్లిడి వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టే నిర్మాతలు కూడా ఎక్కడా రాజీ పడటం లేదు. కేవలం వీఎఫ్ఎక్స్కే 75కోట్లు ఖర్చు పెడుతున్నారు. హాలీవుడ్ సాంకేతిక బృందం ఈ సినిమాకోసం పనిచేస్తున్నారు. దీంతో దేశంలో రూపొందుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాల్లో ‘విశ్వంభర’ ఒకటిగా నిలిచింది. ఇందులో కారణజన్ముడిగా చిరంజీవి కనిపిస్తారట.
విశ్వంభర అనే లోకానికీ కారణజన్ముడిగా పుట్టిన ఓ మానవుడికీ మధ్య సంబంధం ఏంటి? అనేదే ఈ సినిమా కథ అని సమాచారం. త్రిష కృష్ణన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అశికా రంగనాథ్, ఇషా చావ్లా, సురభి పురానిక్, కునాల్ కపూర్ ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: చోటా.కె.నాయుడు, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, నిర్మాతలు: వి.వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్‌రెడ్డి, నిర్మాణం: యూవీ క్రియేషన్స్.