Mega Family | మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోలందరిని కలిపితే ఓ క్రికెట్ జట్టు తయారవుతుంది. చిరంజీవిని స్పూర్తిగా తీసుకొని ఇండస్ట్రీకి వచ్చిన స్టార్స్ ఆ తర్వాత తమ సత్తా చాటుకుంటూ స్టార్స్‌గా మారుతున్నారు. అయితే మెగా హీరోలందరు కలిసి ఓ సినిమా చేస్తే బాగుండు అనే ఆలోచన అభిమానుల మదిలో ఉంటుంది. కాని అంత పెద్ద బాధ్యతని ఏ దర్శకుడు తీసుకునే రిస్క్ చేయలేదు. ఇప్పుడు మెగా ఫ్యామిలీ సినిమాకు తమిళ టాప్ డైరెక్టర్ దర్శకత్వం వహించనున్నట్టు సమాచారం. ఆ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, మెగా నాగబాబు, నిహారిక.. ఇలా మెగా ఫ్యామిలీ మొత్తం ఒకే ఫ్రేంలో కనిపించేలా ప్లాన్ చేస్తున్నారట.
ఇదే జరిగితే మాత్రం మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులు అనేవి ఉండవనే చెప్పాలి. అయితే మెగా ఫ్యామిలీ గ్రాండ్ ప్రాజెక్ట్‌కి దర్శకత్వం వహించబోయేది తమిళ్ టాప్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ అన్న టాక్ గట్టిగా వినిపిస్తుంది. విక్రమ్, లియో లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన ఈ తమిళ స్టార్ డైరెక్టర్ ఇప్పుడు మెగా కాంపౌండ్‌కి ఓ పవర్ఫుల్ యాక్షన్ యూనివర్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ భారీ ప్రాజెక్ట్‌ని ఎవరు నిర్మిస్తారనే చర్చ నడుస్తుంది. ఈ భారీ మెగా ప్రాజెక్ట్‌కి ఇప్పటికే మైత్రీ మూవీ మేకర్స్ లాంటి పెద్ద నిర్మాణ సంస్థలు బడ్జెట్ పరంగా అడ్వాన్స్ కూడా ఇచ్చేశాయని అంటున్నారు.
నిజంగా ఇది జరిగితే ఇక అద్భుతం అనే చెప్పాలి. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఓ భారీ మల్టీ స్టారర్ మూవీ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ భారీ ప్రాజెక్ట్‌కి టైటిల్, స్క్రిప్ట్, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనేది అంతా సీక్రెట్‌గానే ఉంచారట. కానీ ఈ ఏడాది చివర్లో అఫిషియల్ అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. అయితే ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ బిజీ షెడ్యూల్ వలన గతంలో ఒప్పుకున్న ప్రాజెక్టులని పూర్తి చేసేందుకు చాలా టైం తీసుకుంటున్నాడు. మరి ఇప్పుడు లోకేష్ కనగరాజ్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది.