Chiranjeevi – Anil ravipudi | టాలీవుడ్ అగ్ర కథానాయకుడు చిరంజీవి కొత్త సినిమాను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇటీవలే ‘సంక్రాంతికి వస్తున్నాం’తో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు అనిల్ రావిపూడితో తన కొత్త ప్రాజెక్ట్‌ను మొదలుపెట్టాడు. మెగా 157 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ ప్రాజెక్ట్ రాబోతుండగా.. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది ఈ చిత్రం. అయితే ఈ ప్రాజెక్ట్ నుంచి తాజా అప్డేట్ ఒకటి బయటకి వచ్చింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా టైటిల్‌తో ఫస్ట్ లుక్ గ్లింప్స్‌ను ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయబోతున్నట్లు సమాచారం. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, చిరంజీవి కుమార్తె సుస్మిత సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తుండగా.. చిరంజీవి ఈ చిత్రంలో తన నిజమైన పేరు శంకర్ వరప్రసాద్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో కథానాయికగా తమిళ లేడి సూపర్ స్టార్ నయనతార హీరోయిన్గా నటించబోతుంది.