అగ్ర కథానాయకుడు చిరంజీవి తాజా చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నది. ‘మెగా157’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకుడు. ఈ సినిమా మూడో షెడ్యూల్ కేరళలో పూర్తయింది. అక్కడ ఓ పాటతో పాటు ప్రధాన తారాగణం పాల్గొనగా కీలకమైన సన్నివేశాలను తెరకెక్కించారు. మూడో షెడ్యూల్ పూర్తయిన సందర్భంగా దర్శకుడు అనిల్ రావిపూడి తన సోషల్‌మీడియాలో ఓ వీడియోను పంచుకున్నారు. దీనికి ‘మన శంకరవరప్రసాద్‌గారు ముచ్చటగా మూడో షెడ్యూల్‌ని కేరళలో పూర్తిచేసుకొని వచ్చారు’ అని తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆ పోస్ట్‌లో ‘మన శంకర వరప్రసాద్’ పేరుకు కోట్స్ పెట్టడంతో సినిమా టైటిల్ అదేనని అభిమానులు అనుకుంటున్నారు.
వచ్చే నెల 22వ తేదీన చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన స్పెషల్ అప్డేట్ వెలువడే అవకాశముంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్పై ఇప్పటికే భారీ అంచనాలేర్పడ్డాయి. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదలకానుంది. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో, నిర్మాతలు: సాహు గారపాటి, సుస్మిత కొణిదెల, రచన-దర్శకత్వం: అనిల్ రావిపూడి.