3 Roses | ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా ఓ వైపు సినిమాలు, మరోవైపు టాక్ షోలు, వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకులకి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది. కొన్నాళ్ల కిందట ఆహాలో వచ్చిన 3 రోజెస్ వెబ్ సిరీస్ ఎంత వినోదం పంచిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈషా రెబ్బా, పాయల్ రాజ్‌పుత్, పూర్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ బాగా క్లిక్ అవడంతో ఈ సిరీస్ ను ఆడియన్స్ చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇక ఈ సిరీస్‌కి సీక్వెల్ ఎప్పుడు వస్తుందా అని ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. వారి కోసం 3 రోజెస్ సీజన్2 కు సంబంధించిన ఓ టీజర్ ను రిలీజ్ చేస్తూ టీమ్ స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చింది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోన్న డైలాగులతో ఈ టీజర్ నవ్వులు పూయిస్తుంది. కొన్నాళ్లుగా సినిమాలతో అలరిస్తోన్న సత్య.. ఇప్పుడు ఓటీటీలోనూ వినోదాన్ని పంచడానికి సిద్ధమయ్యారు. ఈషా రెబ్బా, హర్ష, సత్య ప్రధానపాత్రల్లో రూపొందుతోన్న సిరీస్ ‘3 రోజెస్’ సీజన్ 2 టీజర్లో సత్య పాత్రను పరిచయం చేస్తూ టీజర్‌ను విడుదల చేశారు. ఈ సిరీస్‌లో ఆయన బెట్టింగ్ భోగి పాత్రలో కనిపించనున్నారు. ఆహా వేదికగా ఇది త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది. కిరణ్ కారవల్ల దర్శకత్వంలో ఇది రూపొందుతుండగా, ఇది ప్రేక్షకులకి మంచి కామెడీ పంచింది అనే చెప్పాలి.
గతంలో కూడా ఒక టీజర్ విడుదల చేశారు. అనౌన్స్మెంట్ వీడియోలో హర్ష చెముడు, ఈషా రెబ్బా కామెడీ టైమింగ్ అదిరిపోయింది. ఈషాని నీ వేస్ట్ బ్యాచ్ ఎక్కడని హర్ష అడగ్గా ఒకామెకు పెళ్లైపోయింది, ఇంకొకరు టూర్స్ తిరుగుతూ ఉన్నారని చెప్పగా, నువ్వేమో ఇలా సింగిల్ చింతకాయలా మిగిలిపోయావా అంటూ సెటైర్ వేయగానే, ఒక్కదాన్నే అని ఎవరు చెప్పారు. ఇప్పుడు కూడా ఇద్దరున్నారంటుంది. అంటే 2 కొత్త రోజెస్ అని హర్ష అడిగితే, అవును, ఈ సారి ఫన్ మామూలుగా ఉండదని 3 రోజెస్ సీజన్2పై హైప్ పెంచేసింది టీమ్. అయితే ఈషా ఫ్రెండ్స్ గా నటించనున్న ఆ ఇద్దరు కొత్త రోజెస్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. వేర్వేరు నేపథ్యాల నుంచి వచ్చిన ముగ్గురమ్మాయిల చుట్టూ తిరిగే కథ, ఎమోషన్స్, కామెడీతోనే ఈ సిరీస్ కూడా రూపొందించినట్టు అర్ధమవుతుంది.