Meesala Pilla | మెగాస్టార్ చిరంజీవి, నయనతార జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. మెగాస్టార్ రియల్ నేమ్‌తో వస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. భీమ్స్ సిసిరిలియో స్వరపరిచిన ఫస్ట్ సింగిల్ ‘మీసాల పిల్ల’ కొద్ది రోజుల క్రితం విడుదల కాగా, ఈ పాట మొదట్లో విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ, ఇప్పుడు దేశవ్యాప్తంగా సెన్సేషన్‌గా మారింది. యూట్యూబ్‌లోనే కాకుండా అన్ని మ్యూజిక్ ప్లాట్‌ఫాంలలోనూ ఈ సాంగ్ నంబర్ వన్ ట్రెండింగ్‌లో నిలిచింది.
యూట్యూబ్‌లో 30 మిలియన్లకు పైగా వ్యూస్, ఇన్‌స్టాగ్రామ్‌లో 30 వేలకు పైగా రీల్స్, 300 మిలియన్ వ్యూస్ ఇలా అన్ని మ్యూజిక్ ప్లాట్‌ఫాంలలో కలిపి 50 మిలియన్+ ప్లేయింగ్స్ సాధించింది. ట్రోలింగ్, మీమ్స్, నెగటివ్ కామెంట్స్ అన్నీ వచ్చినా, ఈ పాట క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. పబ్లిక్‌లో బాగా పాపులర్ అవుతూ “వింటేజ్ చిరంజీవి”ను మళ్లీ గుర్తుచేస్తోందని అభిమానులు చెబుతున్నారు. ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రానికి భీమ్స్ ఇది కెరీర్లోనే అతిపెద్ద ప్రాజెక్ట్. ఉదిత్ నారాయణ్ వాయిస్‌లో వచ్చిన ఈ మాస్ నంబర్ ప్రేక్షకుల్లో ఆకట్టుకుంది. చిరంజీవి డ్యాన్స్ మూవ్స్, నయనతార స్క్రీన్ ప్రెజెన్స్, అనిల్ రావిపూడి మాస్ టచ్ అన్నీ కలసి ఈ పాట అందరి దృష్టిని ఆకర్షించేలా చేశాయి.
సోషల్ మీడియాలో కొంతమంది ఈ పాటను “సీరియల్ సాంగ్” అంటూ ట్రోల్ చేసినా, అభిమానులు మాత్రం “చిరు స్టైల్ మాస్ ఎంటర్టైనర్” అంటూ సపోర్ట్ చేస్తున్నారు. ఈ సాంగ్ క్రేజ్ కారణంగా సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఆయన షూటింగ్లో పాల్గొన్నట్లు సమాచారం. చిరంజీవి – వెంకటేష్ కాంబినేషన్లో వచ్చే సీన్లపై భారీ హైప్ ఉంది. షైన్ స్క్రీన్స్, గోల్డ్‌బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. “2026 సంక్రాంతి కానుకగా వస్తున్నాం”* అంటూ టీమ్ ఇప్పటికే ప్రకటించింది. “ట్రోలింగ్ ఎంతున్నా సరే, మెగాస్టార్ గ్రేస్‌ను ఆపలేరు. ‘మీసాల పిల్ల’ ఇండియాలో యునానిమస్ మ్యూజికల్ సెన్సేషన్‌గా నిలిచింది” అని చిత్ర బృందం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.