ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Cinema - Aug 03, 2020 , 11:35:33

సుశాంత్ మృతి.. సంచ‌ల‌న విష‌యాలు చెప్పిన డెర్మ‌టాల‌జిస్ట్

సుశాంత్ మృతి.. సంచ‌ల‌న విష‌యాలు చెప్పిన డెర్మ‌టాల‌జిస్ట్

సుశాంత్ మృతికి సంబంధించి రోజుకో కొత్త విష‌యం వెలుగులోకి వ‌స్తుంది. సుశాంత్‌ది ఆత్మ‌హ‌త్య కాదు హ‌త్యే అంటూ  మాజీ కేంద్రమంత్రి సుబ్రమణియన్ స్వామి సంచ‌ల‌న కామెంట్స్ చేసిన కొద్ది రోజుల‌కి ప్రముఖ డెర్మటాలజిస్ట్ డా.మీనాక్షి మిశ్రా త‌న ట్విట్ట‌ర్ ద్వారా షేర్ చేసిన వీడియో ఇప్పుడు ప‌లు అనుమానాలు రేకెత్తిస్తుంది. సుశాంత్ మ‌ర‌ణించిన‌ త‌ర్వాత తీసిన ఫోటోల‌ని ఒక్కొక్క‌టిగా చూపిస్తూ వాటిపై త‌న వాద‌న‌ని వినిపించింది.

సుశాంత్ ముఖంపై ప‌లు చోట్ల గాయాలు క‌నిపిస్తున్నాయి. కంటి కింద కమిలిపోయిన‌ట్టుంది. ఒక క‌న్ను స‌గం మాత్రమే మూసుకుపోయింది. అలానే ఉరి వేసుకున్న త‌ర్వాత సుశాంత్ శ‌రీరంలో ప‌లు మార్పులు గ‌మ‌నించ‌వ‌చ్చు. ఉరి వేసుకున్న వారి శ‌రీరం ఈ విధంగా ఉండ‌దు అంటూ మీనాక్షి ప‌లు అనుమానాలు వ్య‌క్తం చేసింది.  ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా షేర్ అవుతున్న ఈ వీడియోని  సుబ్రమణియన్ స్వామి రీ ట్వీట్ చేయ‌డం విశేషం.


logo