Meenakshi Chowdary | టాలీవుడ్లో “లక్కీ హీరోయిన్”గా పేరు తెచ్చుకున్న అందాల భామ మీనాక్షి చౌదరి ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ జోష్‌లో కొనసాగుతోంది. గత ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘వస్తున్నాం’ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఆమె, ఇప్పుడు మరోసారి పండగ సీజన్‌ను టార్గెట్ చేస్తోంది. యంగ్ హీరో నవీన్ పోలిశెట్టితో కలిసి నటించిన తాజా చిత్రం ‘అనగనగా ఒక రాజు’ తో ఈసారి కూడా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు మంచి స్పందన తెచ్చుకోగా, ప్రమోషన్స్‌లో మీనాక్షి చౌదరి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ముఖ్యంగా ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ఇంటర్వ్యూల్లో ఆమె మాట్లాడిన సరదా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇటీవల ఓ ప్రమోషనల్ ఈవెంట్లో తనకు కాబోయే భర్త గురించి మాట్లాడిన మీనాక్షి చౌదరి, కొన్ని ఆసక్తికరమైన ‘కండిషన్స్’ పెట్టి అందరినీ నవ్వులు పూయించింది. తన భర్త డాక్టర్, నటుడు లేదా మిస్టర్ ఇండియా మాత్రం అసలు కాకూడదని స్పష్టం చేసింది. తాను ఇప్పటికే సినిమా రంగంలో ఉన్నానని, ఇంట్లో మరోసారి అదే ప్రొఫెషన్ అవసరం లేదని చమత్కారంగా వ్యాఖ్యానించింది. అంతేకాదు, తన జీవిత భాగస్వామికి 100 ఎకరాల పొలం ఉండాలి అంటూ చెప్పిన మాటలు ఈవెంట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వ్యవసాయం, పల్లెటూరి వాతావరణం అంటే తనకు చాలా ఇష్టమని తెలిపింది.
ఇక ఇంటి పనుల విషయంలో కూడా మీనాక్షి తన స్టైల్లో కండిషన్స్ పెట్టింది. వంట చేయడం, బట్టలు ఉతకడం, ఐరన్ చేయడం వంటి పనులు రావాలని చెప్పి నవ్వులు పూయించింది. అబ్బాయికి గతంలో బ్రేకప్స్ ఉన్నా తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే పొడవుగా ఉండాలని మాత్రం కచ్చితంగా చెప్పింది. రోజుకు రెండు మూడు సార్లు లవ్ ప్రపోజ్ చేస్తూ, గిఫ్ట్స్ ఇచ్చే వ్యక్తే తన “రాజు” అంటూ సరదాగా పేర్కొంది. ఇటీవల కొంతకాలంగా మీనాక్షి చౌదరికి టాలీవుడ్ హీరోలతో ప్రేమాయణం ఉందంటూ పలు రూమర్స్ వినిపించాయి. అయితే వాటన్నింటినీ ఆమె ఖండిస్తూ, పూర్తిగా అబద్ధమని కొట్టి పారేసింది. ప్రస్తుతం తన పూర్తి ఫోకస్ సినిమాలపైనే ఉందని స్పష్టం చేసింది. ‘అనగనగా ఒక రాజు’ సినిమాతో పాటు మీనాక్షి చౌదరి ఇతర భాషల్లోనూ బిజీగా ఉంది. కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ నటిస్తున్న 63వ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. అలాగే తమిళంలో ‘వృషకర్మ’ అనే చిత్రంలోనూ కీలక పాత్ర పోషిస్తోంది.