Pradeep Ranganathan | తమిళ యువ సంచలనం ప్రదీప్ రంగనాథన్ పేరు ఇప్పుడు సౌత్ చిత్ర పరిశ్రమలో మారుమోగిపోతోంది. ‘లవ్ టుడే’ సినిమాతో యూత్ ఐకాన్‌గా మారిన ప్రదీప్ ఆ తర్వాత డ్రాగన్, డ్యూడ్ చిత్రాలతో సూపర్ హిట్లు అందుకున్నాడు. కేవలం దర్శకుడిగానే కాకుండా నటుడిగా తనదైన ముద్ర వేశారు. అయితే ప్రదీప్ ఇప్పుడు మరోసారి మెగాఫోన్ పట్టుకుని, కెప్టెన్ కుర్చీలో కూర్చోవడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు యూత్ ఫుల్ లవ్ స్టోరీలతో మెప్పించిన ప్రదీప్ ఈసారి తన రూటు మార్చినట్లు తెలుస్తుంది. పూర్తిస్థాయి సైన్స్ ఫిక్షన్ కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో ప్రదీప్ సరసన టాలీవుడ్ లక్కీ బ్యూటీ మీనాక్షి చౌదరి కథానాయికగా నటించనుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న మీనాక్షికి ఈ పాత్ర తన కెరీర్లోనే అత్యంత కీలకంగా మారుతుందని టాక్.
ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు తుది దశకు చేరుకోగా.. వచ్చే మార్చి నెలలో ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లి, లాంగ్ షెడ్యూల్లో సింగిల్ స్ట్రెచ్‌గా షూటింగ్ పూర్తి చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. ప్రదీప్ మునుపటి సినిమాలతో పోలిస్తే ఇది చాలా డిఫరెంట్‌గా ఉంటుందని టాక్. కేవలం వినోదమే కాకుండా, ఊహించని మలుపులతో సాగే సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయని సమాచారం.