బాలీవుడ్లో ‘ఫోర్స్’ ప్రాంఛైజీ చిత్రాలు మంచి విజయాలు సాధించాయి. జాన్ అబ్రహం హీరోగా రూపొందిన రెండు భాగాలు ప్రేక్షకాదరణ పొందాయి. ఈ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్‌లో మూడో సినిమా రానుంది. భవ్ ధూలియా దర్శకుడు. ఈ చిత్రంలో కథానాయికగా మీనాక్షి చౌదరిని ఖరారు చేశారు. హిందీలో పూర్తిస్థాయి నాయికగా ఆమె నటించబోతున్న తొలిచిత్రమిదే కావడం విశేషం. తెలుగులో హిట్-2, గుంటూరు కారం, లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలతో మంచి విజయాలు దక్కడంతో కొన్నేళ్లుగా టాలీవుడ్లోపైనే దృష్టిపెట్టిందీ భామ.
తాజాగా భారీ ఆఫర్‌తో హిందీలోకి రీఎంట్రీ ఇస్తున్నది. ఈ సినిమాలో ఆమె యాక్షన్ ప్రాధాన్యం ఉన్న పాత్రలో కనిపిస్తుందని, అందుకోసం కొన్ని వర్క్‌షాప్స్‌లో కూడా పాల్గొనబోతున్నదని టాక్. నవంబర్‌లో ఈ చిత్రం సెట్స్‌మీదకు వెళ్లనుంది. ప్రస్తుతం మీనాక్షి చౌదరి తెలుగులో నవీన్ పొలిశెట్టి సరసన ‘అనగనగా ఒకరాజు’ చిత్రంలో నాయికగా నటిస్తున్నది.