చిన్ని కుప్పిలి సమర్పణలో సూర్యనారాయణ క్రియేషన్స్ పతాకంపై లయన్ కుప్పిలి శ్రీనివాస్ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘మీలో ఒకడు’. హ్రితిక సింగ్, సాధన పవన్ నాయికలుగా నటిస్తున్నారు. సుమన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్ విడుదల కార్యక్రమం సోమవారం హైదరాబాద్లో జరిగింది. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ…‘44 ఏళ్ల కెరీర్ నాది. ఇప్పటికీ నిర్మాతలు, అభిమానులు నన్ను ఆదరిస్తున్నారు.
ఈ సినిమాలో నటించడం సంతోషంగా ఉంది. ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే మలుపులతో ఈ సినిమా సాగుతుంది. సినిమాకు యూనిట్ అంతా ఇష్టంతో పనిచేశారు’ అని అన్నారు. ‘యూత్, మాస్ ఇష్టపడే చిత్రమిది. నా అభిమాన హీరో సుమన్ గారితో కలిసి నటించడం మర్చిపోలేను. సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నా’ అని కుప్పిలి శ్రీనివాస్ అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : పొడిపి రెడ్డిశ్రీను, సంగీతం : జై సూర్య.