‘ఇష్క్ ఇన్ ది ఎయిర్’ చిత్రంతో బాలీవుడ్లో మంచి గుర్తింపును సంపాదించుకుంది యువ నాయిక మేధా రానా. ప్రస్తుతం ఈ భామ భారీ ఆఫర్‌ను చేజిక్కించుకుంది. వరుణ్‌ధావన్ సరసన ‘బోర్డర్-2’ చిత్రంలో కథానాయికగా నటించనుంది. ‘కేసరి’ ఫేమ్ అనురాగ్‌సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని టీ సిరీస్, జెపీ ఫిల్మ్స్ వంటి అగ్ర నిర్మాణ సంస్థలు తెరకెక్కిస్తున్నాయి.
దేశభక్తి ప్రధానంగా యాక్షన్ డ్రామాగా రూపొందనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరిలో విడుదలకానుంది. అయితే ఈ సినిమా 1997లో వచ్చిన బ్లాక్‌బస్టర్ హిట్ ‘బోర్డర్’కు సీక్వెల్ కాదని, అదే రీతిలో సైనికుల అసమాన త్యాగాలు, దేశభక్తి ప్రధానంగా రూపొందిస్తున్నామని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రంలో సన్నీ డియోల్ కీలక పాత్రలో నటించ నున్నారు. త్వరలో సెట్స్‌మీదకు వెళ్లనుంది.