Mechanic Rocky OTT | టాలీవుడ్ ఇండస్ట్రీలో యూత్‌లో మంచి క్రేజ్ ఉన్న కథానాయకుడు విశ్వక్సేన్ (Vishwak Sen). ఆయన సినిమా వస్తుందంటే అంచనాలు సర్వసాధారణం. అయితే రీసెంట్గా విశ్వక్ ప్రధాన పాత్రలో వచ్చిన తాజా చిత్రం ‘మెకానిక్ రాకీ’ (Mechanic Rocky). రవితేజ ముళ్లపూడి (డెబ్యూ) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికలుగా నటించారు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ యాక్షన్ కామెడీ ఫిల్మ్ యూత్‌ను ఆకట్టుకుంది. ఇప్పుడు తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది ఈ చిత్రం. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ (Amazon Prime Video)లోఈ సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. బీటెక్ని మధ్యలోనే ఆపేసి తండ్రి రామకృష్ణ(నరేష్ వీకే) నడుపుతున్న గ్యారేజీలోనే మెకానిక్‌గా సెటిల్ అవుతాడు నగుమోము రాకేష్ అలియాస్ రాకీ(విశ్వక్సేన్). కార్లను బాగుచెయ్యడంతోపాటు, డ్రైవింగ్ కూడా నేర్పుతుంటాడు. ఓ రోజు రాకీ స్కూల్లో డ్రైవింగ్ నేర్చుకోవడానికి మాయ(శ్రద్ధా శ్రీనాథ్) అనే అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయికి డ్రైవింగ్ నేర్పే క్రమంలో ఇద్దరు ఫ్రెండ్స్ అవుతారు. తాను బీటెక్ మధ్యలో ఎందుకు మానేసింది… కాలేజ్‌లో తన స్నేహితుడు చెల్లెలు ప్రియ(మీనాక్షి చౌదరి)తో తన ప్రేమకథ.. ఇవన్నీ చెప్పడం మొదలుపెడతాడు రాకీ. అసలు ప్రియకు తనెందుకు దూరమయ్యాడు? వీరిద్దరూ విడిపోవడంలో తన స్నేహితుడి పాత్ర ఏంటి? ప్రియ కోసం రాకీ చేసిన సాహసం ఏంటి? అసలు మాయ ఎవరు? ఈ ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ.
Revv up for the ultimate showdown 🏎️🔧#MechanicRockyOnPrime, watch now: https://t.co/2EYeGfbHI5@VishwakSenActor @Meenakshiioffl @ShraddhaSrinath pic.twitter.com/GfZpGpdnA8
— prime video IN (@PrimeVideoIN) December 13, 2024