మణిసాయితేజ, రేఖ నిరోషా జంటగా నటించిన చిత్రం ‘మెకానిక్’. ముని సహేకర దర్శకుడు. ఏం. నాగ మునెయ్య నిర్మాత. ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకురానుంది. సోమవారం ప్రిరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సినిమాట్రోగఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
దర్శకుడు మాట్లాడుతూ ‘ఈ సినిమా పాటలకు మంచి ఆదరణ లభించింది. ఓ సామాజిక సమస్యను ఇతివృత్తంగా తీసుకొని తెరకెక్కించాం. సినిమాలోని సందేశం అందరిని ఆకట్టుకుంటుంది’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఎస్.పి.శివరాం, సంగీతం: వినోద్ యాజమాన్య, దర్శకత్వం: ముని సహేకర.