Rahi Anil Barve | తుంబాడ్’ (Tumbbad) వంటి హారర్-ఫాంటసీ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న రచయిత, దర్శకుడు రాహి అనిల్ బార్వే తన తదుపరి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన దర్శకత్వంలో రాబోతున్న తాజా చిత్రం ‘మయసభ: ది హాల్ ఆఫ్ ఇల్యూజన్’ (Mayasabha: The Hall Of Illusion). ఈ సినిమాలో జావేద్ జాఫేరీ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. వీణా జాంకర్, దీపక్ దామ్లే, మహమ్మద్ సమద్ కీలక పాత్రల్లో నటించబోతున్నారు. పికల్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ సమర్పిస్తుండగా.. జిర్కాన్ ఫిల్మ్స్ పీ లిమిటెడ్ (Zirkon Films P Ltd) నిర్మిస్తోంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమాను జనవరి 16న 2026 ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.