May 3rd week Releases | సినిమాల మంత్‌గా పిలుచుకునే మే నెల బాక్సాఫీస్‌కు ఈ సారి పెద్దగా కలిసి రాలేదు. తొలివారం భారీ అంచనాల నడుమ రిలీజైన రామబాణం, ఉగ్రం రెండూ మిక్స్డ్ టాక్ తెచ్చుకుని డిస్ట్రిబ్యూటర్లకు తీవ్ర నష్టాల్ని మిగిల్చాయి. ఉగ్రం అక్కడో ఇక్కడో కనిపిస్తుంది కానీ.. రామబాణం వారంలోపే దుకాణం సర్దేసింది. ఇక ఆ తర్వాతి వారం అక్కినేని ఫ్యాన్స్ గంపెడంతో ఆశలు పెట్టుకున్న కస్టడీ రిలీజై నెగెటీవ్ టాక్ తెచ్చుకుంది. ఈ సారి నాగచైతన్య కూడా అభిమానులను ఆకట్టుకోలేకపోయాడు. ఇక ఇప్పుడు మే మూడో వారంలోకి వచ్చేశాం. ఈ వారం విందు భోజనం పెట్టడానికి సినిమాలతో పాటు ఓటీటీ ప్రేక్షకుల కోసం పలు వెబ్ సిరీస్‌లు కూడా వస్తున్నాయి. ఇక ఈ వారం థియేటర్/ఓటీటీలలో విడుదలయ్యే సినిమాలు/వెబ్ సిరీస్లెంటో ఓ లుక్కేద్దాం.
థియేటర్లో విడుదలయ్యే సినిమాలు:
బిచ్చగాడు-2:
ఈ వారం కాస్త ఎక్కువ హైప్‌తో రిలీజవుతున్న సినిమా ఇది. ఏడేళ్ల క్రితం విడుదలైన బిచ్చగాడు ఎలాంటి వండర్స్ క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎలాంటి అంచనాల్లేకుండా విడుదలై టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర కోట్లు కొల్లగొట్టింది. నిజానికి ఈ సినిమా తమిళంలో కంటే తెలుగులోనే ఎక్కువ కలెక్షన్లు సాధించింది. ఇక ఇప్పుడు దీనికి కొనసాగింపుగా బిచ్చగాడు-2 తెరకెక్కింది. విజయ్ ఆంటోని నటిస్తూ, దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 19న విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్లు సినిమాపై ఎక్కడలేని అంచనాలు క్రియేట్ చేశాయి.
హసీనా:
తన్వీర్, ప్రియాంక, సాయ తేజ గంజీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా మే 19న విడుదల కానుంది. నవీన్ ఎరగని దర్శకత్వం వహించిన ఈ సినిమా క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కింది. ఇప్పటి వరకు రిలీజైన టీజర్, ట్రైలర్లు సినిమాపై మంచి అంచనాలే నెలకొల్పాయి.
ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు/వెబ్ సిరీస్‌లు:
సోనీ లివ్:
ఏజెంట్ –మే 19
కదిన కదోరమి అందకదం( మలయాళ మూవీ)-మే 19
ఆహా:
ఏమి సేతురా లింగా – మే 19
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్:
డెడ్ పిక్సల్స్ (వెబ్ సిరీస్)-మే 19
పూక్కాలమ్ (మలయాళ సినిమా)-మే 19
నెట్‌ఫ్లిక్స్:
అయల్ వాసి (మలయాళ)-మే 19
కఠల్ (హిందీ)-మే 19
నామ్ సీజన్ 2 (తమిళ సిరీస్)- మే 19
విరూపాక్ష – మే 21