హీరో వరుణ్ తేజ్ ‘మట్కా’ అనే సినిమాతో పాన్ ఇండియాలో అరంగేట్రం చేస్తున్నారు. ‘పలాస 1978’, ‘శ్రీదేవి సోడా సెంటర్’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. వైర ఎంటర్టైన్మెంట్స్, ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. హైదరాబాద్‌లో వేసిన ఓ భారీ సెట్లో ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. శుక్రవారం వరుణ్ తేజ్‌కు పుట్టిన రోజు సందర్భంగా ‘మట్కా’ ఓపెనింగ్ బ్రాకెట్ వీడియోను విడుదల చేశారు. 1958-1982 మధ్య జరిగిన సంచలన యధార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిస్తున్న కథ ఇది. నోరా ఫతేహీ, మీనాక్షి చౌదరి హీరోయిన్స్. నవీన్ చంద్ర, కన్నడ కిశోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రానికి డీవోపీ: ఏ కిశోర్ కుమార్, సంగీతం: జీవీ ప్రకాశ్ కుమార్, నిర్మాతలు: డాక్టర్ విజయేందర్‌రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: కరుణ కుమార్.