Matka Movie | మెగా హీరో వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం మట్కా (Matka). పలాస 1978 సినిమాతో హిట్ అందుకున్న కరుణ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. విజేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమా నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించింది చిత్రబృందం.
ఈ వేడుకలో వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. నా నుంచి ఒక మంచి సినిమాను మీకు అందించాలని అనుకునేవాడిని. దానికి తగ్గట్టుగా.. ఒక మాస్ సినిమా చేద్దాం అందరు నచ్చే సినిమా చేద్దాం అనుకున్నప్పుడు కరుణ కుమార్ కలిశారు. అతడోక సూపర్ కథను నాకు చెప్పాడు. అప్పుడే అనుకున్నాను ఈ సినిమా చేద్దాం అని. నాకు కూడా కష్టపడి చేసిన సినిమా ఆడకపోతే బాధేస్తుంది. ఈ విషయంలో మా అన్నయ్య రామ్ చరణతో మాట్లాడితే నాకు ధైర్యం వస్తుంది. నాకు ఎమోషనల్ గా అన్నయ్య చాలా సపోర్ట్ చేస్తాడు. థ్యాంక్స్ చరణ్ అన్న. మా బాబాయ్, పెదనాన్న నా గుండెల్లో ఉంటారు. అందరూ వాళ్ళ గురించే ఎందుకు మాట్లాడతావు అని అడుగుతారు. మా బాబాయ్, మా పెదనాన్న, మా అన్నయ్య చరణ్ గురించి నేను మాట్లాడుతాను అది నా ఇష్టం.
లైఫ్లో నువ్వు పెద్దొడు అవొచ్చు.. అవ్వకపోవచ్చు కానీ… నువ్వు ఎందుకు మొదలుపెట్టావు … ఎక్కడ నుండి వచ్చావు.. నీ సపోర్ట్ ఎవరు అని మర్చిపోతే నీ సక్సెస్ దేనికి పనికి రాదు. పెద్దనాన్న, బాబాయ్, నాన్న అన్నయ్య ఎప్పుడు నా మనసులో ఉంటారు. అంటూ వరుణ్ తేజ్ చెప్పుకోచ్చాడు. అయితే వరుణ్ తేజ్ చేసిన నీకు సపోర్ట్ చేసిన వాళ్ళని మర్చిపోతే నీ సక్సెస్ పనికిరాదు అనే వ్యాఖ్యలు అల్లు అర్జున్ను టార్గెట్ చేసి చేశాడా అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.
#Matka – Your success is of no use if you forget your roots, says #VarunTej pic.twitter.com/NtF1mIRW6t
— Aakashavaani (@TheAakashavaani) November 10, 2024