Matka Movie | విడుదలై నెల కూడా కాకుండానే ఓటీటీలోకి రాబోతుంది వరుణ్ తేజ్ మట్కా మూవీ. వరుణ్ కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టార్‌గా నిలిచిన ఈ సినిమా తాజాగా ఓటీటీ అనౌన్స్‌మెంట్‌ను పంచుకుంది. మెగా హీరో వరుణ్ తేజ్‌కి ఈ మధ్య అసలు కలిసి రావాట్లేదన్న విషయం తెలిసిందే. అప్పుడెప్పుడో ఫిదా, తొలిప్రేమ సినిమాలతో సాలిడ్ హిట్లు అందుకున్న ఈ కుర్ర హీరో కెరీర్ గ్రాఫ్ సడన్‌గా పడిపోయింది. ఆపరేషన్ వాలంటైన్, గాండీవ ధారి అర్జున, గని సినిమాలతో వరుస డిజాస్టార్లను అందుకున్నాడు. ఇప్పుడు మట్కా సినిమాతో తాజాగా మరో డిజాస్టార్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా ఎంతటి పరజయం అందుకుంది అంటూ కనీసం పెట్టిన బడ్జెట్ కూడా రాకపోవడం విశేషం. ఇదిలావుంటే తాజాగా ఈ చిత్రం ఓటీటీ లాక్ చేసుకుంది.
ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా డిసెంబర్ 05 నుంచి తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించింది. పలాస 1978 సినిమాతో హిట్ అందుకున్న కరుణ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. విజేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి ఈ సినిమాను నిర్మించారు. మీనాక్షి చౌదరి కథానాయికగా నటించింది.
risk, reward & gamble – MATKA Vasu is the ringmaster who rules them all 👑#MatkaOnPrime, December 5 pic.twitter.com/Djsux1H6nJ
— prime video IN (@PrimeVideoIN) November 30, 2024
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. బర్మా నుంచి వైజాగ్‌కు శరణార్థిగా వస్తాడు వాసు (వరుణ్ తేజ్). ఓ హత్య చేసి చిన్నతనంలోనే జైలుకు వెళ్తాడు. అక్కడ రాటు తేలిపోతాడు. వాసు జైలు నుంచి విడుదలయ్యాక పూర్ణ మార్కెట్ లో కొబ్బరికాయల వ్యాపారి అప్పలరెడ్డి (అజయ్ ఘోష్) దగ్గర పనికి చేరతాడు. ఈ క్రమంలో చోటు చేసుకున్న ఓ గొడవలో కె.బి (జాన్ విజయ్) రౌడీ గ్యాంగ్‌ను ఎదురించిన వాసు.. అక్కడి నుంచి పూర్ణ మార్కెట్‌కు నాయకుడిగా, మట్కా కింగ్ గా ఎలా ఎదిగాడు ? అనేది మిగతా కథ.