MATA 2026 | అమెరికాలో తెలుగు సందడి.. గ్రేటర్ ఫిలడెల్ఫియాలో ‘మాటా’ మహాసభలు విజయవంతం
MATA | పెన్సిల్వేనియా: మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మాటా’ 2వ మహాసభలు అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలోని గ్రేటర్ ఫిలడెల్ఫియా ఎక్స్పో సెంటర్లో అత్యంత వైభవంగా జరిగాయి.
MATA | పెన్సిల్వేనియా: మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మాటా’ 2వ మహాసభలు అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలోని గ్రేటర్ ఫిలడెల్ఫియా ఎక్స్పో సెంటర్లో అత్యంత వైభవంగా జరిగాయి. రెండు రోజుల పాటు సాగిన ఈ మహాసభల్లో ఉత్తర అమెరికా నలుమూలల నుంచి 7,500కు పైగా తెలుగు కుటుంబాలు పాల్గొని ప్రపంచ తెలుగు ఐక్యతను చాటాయి.
సంస్కృతి, ఆధ్యాత్మికత, వినోదం, నాయకత్వం, సాంకేతికత, సేవా కార్యక్రమాలు, సామాజిక చైతన్యం వంటి అంశాలను సమన్వయం చేస్తూ నిర్వహించిన ఈ మహాసభలు ఉత్తర అమెరికాలో జరిగిన అతిపెద్ద తెలుగు సమ్మేళనాల్లో ఒకటిగా గుర్తింపు పొందాయి. తెలుగు సినీ, సాంస్కృతిక రంగ ప్రముఖుల రాకతో మహాసభలు మరింత కళకళలాడాయి. ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ లైవ్ కాన్సర్ట్‌తో వేలాది మంది ప్రేక్షకులను ఉర్రూతలూగించగా, గాయకుడు రామ్ మిర్యాల సంగీత విభావరి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హీరో నిఖిల్ సిద్ధార్థ్, నటి ఐశ్వర్య రాజేష్, సీనియర్ నటి జయప్రద, నటులు సుమన్, అలీ, హాలీవుడ్ నటుడు విషి అయ్యర్, శివారెడ్డి, అధిరే అభి, సునామి సుధాకర్, మిమిక్రీ రమేష్ తదితరులు తమ ప్రదర్శనలు, అభిమానులతో ముచ్చట్లతో అలరించారు. గ్రాండ్ బ్యాంక్వెట్ కార్యక్రమానికి నిఖిల్ విజయేంద్ర సింహా వ్యాఖ్యాతగా వ్యవహరించగా, ప్రధాన మహాసభకు యాంకర్ సుమ కనకాల, ప్రదీప్ మాచిరాజు వ్యాఖ్యాతలుగా వ్యవహరించి సభను ఉత్సాహభరితంగా నడిపించారు. మహాసభల ప్రత్యేక ఆకర్షణగా ప్రముఖ నటి జయప్రదకు ‘మాటా లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు’ ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా 30 మందికి పైగా కళాకారులు అందించిన శాస్త్రీయ నృత్యాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అలాగే విజ్ఞానం, వైద్యం, ఆవిష్కరణలు, మానవతా సేవల రంగాల్లో విశిష్ట సేవలు అందించిన డాక్టర్ ఎం.ఎస్. రెడ్డి, డాక్టర్ హరినాథ్ పోలిచర్లలకు ప్రతిష్టాత్మక ‘ప్రైడ్ ఆఫ్ ఇండియా’ అవార్డులు అందజేశారు. సమాజ సేవ, వ్యాపారం, కళలు, యువ పారిశ్రామికవేత్తలు, మానవతా సేవలు, సినిమా, ప్రపంచ తెలుగు వారసత్వ పరిరక్షణ వంటి రంగాల్లో విశేష కృషి చేసిన పలువురిని ‘మాటా ఎక్సలెన్స్ అవార్డ్స్ 2026’తో సత్కరించారు. టీ.పీ. శ్రీనివాస్ రావు, భాస్కర్ గంటి, సాయినాథ్ కర్నాటి, స్వాతి అట్లూరి, దాము గేదల, డాక్టర్ విజయ భాస్కర్ బొల్గం, నాగేశ్వరరావు పూజారి, రాజు చామర్తి, కృష్ణ మద్దిపట్ల అవార్డులు అందుకున్నారు.
మాటా మహాసభలు మత సామరస్యానికి చిహ్నంగా నిలిచాయి. ప్రధాన కార్యక్రమాన్ని ఒక ఇమామ్, క్రైస్తవ పాస్టర్, హిందూ పూజారి సంయుక్త ప్రార్థనలతో ప్రారంభించారు. వేలాది మంది భక్తుల సమక్షంలో శ్రీ సీతారామ శోభాయాత్ర, భద్రాద్రి శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం, పట్టాభిషేక కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. వినోద కార్యక్రమాలతో పాటు నాయకత్వం, కృత్రిమ మేధస్సు, వ్యాపారం, మహిళా సాధికారత, వైద్యం, న్యాయ వ్యవస్థ, రాజకీయాలు, సాహిత్యం, యువజన నాయకత్వం, నెట్వర్కింగ్ వంటి అంశాలపై ప్రత్యేక ఫోరమ్‌లు నిర్వహించారు. ప్రపంచ స్థాయి స్టేజ్ డిజైన్, అద్భుత ఆడియో విజువల్ వ్యవస్థలు, అత్యాధునిక లైటింగ్, క్రమబద్ధమైన నిర్వహణ మహాసభలకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయి. గ్రాండ్ బ్యాంక్వెట్‌లో తెలుగు, భారతీయ, అంతర్జాతీయ వంటకాలతో ఏర్పాటు చేసిన ప్రత్యేక విందు ఆహ్వానితుల ప్రశంసలు అందుకుంది.
మాటా అధ్యక్షుడు రమణ కిరణ్ దుద్దాగి, కన్వీనర్ శ్రీధర్ గూడల, జనరల్ సెక్రటరీ విజయ భాస్కర్ కలాల్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ప్రవీణ్ గుడూరు, కన్వెన్షన్ కోఆర్డినేటర్ కల్యాణి బెల్లంకొండ నాయకత్వంలో ఈ మహాసభలు ఘనవిజయం సాధించాయి. వ్యవస్థాపకులు, అడ్వైజరీ కౌన్సిల్ సభ్యులు శ్రీనివాస్ గణగోని, ప్రదీప్ సామల, జితేందర్ రెడ్డి మార్గదర్శకత్వం ఈ విజయానికి ప్రధాన బలంగా నిలిచింది. సేవ, సంస్కృతి, సమానత్వం అనే మాటా ఆశయాలను ప్రతిబింబిస్తూ నిర్వహించిన ఈ మహాసభలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు కుటుంబాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చాయి. 7,500కు పైగా తెలుగు కుటుంబాల భాగస్వామ్యం, ప్రపంచ స్థాయి వినోద కార్యక్రమాలు, ఆధ్యాత్మిక వేడుకలు, నాయకత్వ సదస్సులు, ప్రతిష్టాత్మక అవార్డులు, అద్భుత ఆతిథ్యంతో మాటా 2వ మహాసభలు 2026 ఉత్తర అమెరికాలో కొత్త చరిత్రను నెలకొల్పాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

